కండోమ్‌తో వీళ్లేం చేశారో తెలిస్తే.. మీరు పగలబడి నవ్వుతారు ..!

కండోమ్‌తో వీళ్లేం చేశారో తెలిస్తే.. మీరు పగలబడి నవ్వుతారు ..!

మీరెప్పుడైనా కండోమ్ (condom) కన్ఫెషన్స్ గురించి విన్నారా? అదేనండీ.. కండోమ్ వాడే విషయంలో వారు చేసిన మోసాలు, తప్పుల గురించి ఒప్పుకోవడం. బహుశా ఇలాంటి వాటి గురించి విని ఉండరేమో. అయితే ఇది మీకు కొత్తగానూ, వింతగానూ ఉంటుంది. అసలు వాటిని చదువుతుంటే.. నవ్వు ఆగదు. నవ్వీ నవ్వీ పొట్ట నొప్పి పెట్టడం ఖాయం. ఏదో అతిగా చెబుతున్నామనుకుంటున్నారేమో. వాటిని చదివితేనే గానీ మీక్కూడా తెలియదు అవి ఎంత కామెడీగా ఉంటాయో.

ఈ కన్ఫెషన్స్‌ను మేం విస్పర్ సైట్లో చూశాం. అవి మాకు బాగా  నచ్చాయి. అందుకే వాటిని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాం. కండోమ్ ఉపయోగించి ఎదుటి వారిని ఫూల్ చేయడానికి ప్రయత్నించడం లేదా దొరికిపోతామేమో అని భయపడిన వారు.. చివరి నిమిషంలో తప్పించుకోవడం లాంటి పనుల గురించి కొందరు విస్పర్ సైట్లో పంచుకున్నారు. వాళ్లేం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

1. అన్నీ అబద్దాలే. ఈ విషయాన్ని నేను అసలు నమ్మను.

ఓ సారి నేను బ్లైండ్ డేట్‌కి వెళ్లాను. ఆ తర్వాతి రోజు మేమిద్దరం ఓ పార్క్‌లో కలుసుకున్నాం. అప్పుడు అతని జేబులోంచి  కండోమ్  ప్యాకెట్ బయటపడింది. అప్పుడతనేం చెప్పాడో తెలుసా? 'లాండ్రీలో ప్యాంట్లు మారిపోయుంటాయి. ఇది నా ప్యాంట్ కాదు' అని. ఆ సమాధానం విని నాకు బాగా నవ్వొచ్చింది.

2. పెద్దలు మీరే ఇలా చేస్తే ఎలా?

మా నాన్న సోషల్ మీడియాలో ‘కండోమ్ ఛాలెంజ్ ఫెయిల్’ అని ఓ ఫొటో పోస్ట్ చేశారు. నిజానికి అది నా కండోమ్స్ ఫొటో.

3. ఊప్స్.. ఇలా జరిగిందేంటి?

నా గర్ల్ ఫ్రెండ్ వాళ్లమ్మ ముందు.. పొరపాటున నా పాకెట్‌లోని కండోమ్ ప్యాకెట్ పడిపోయింది.

Giphy

4. ఇలా చేయడం కంటే.. అలా చేయడమే బెటర్ కదా

నా రూంలో దొరికిన ఖాళీ కండోమ్ ప్యాకెట్ పట్టుకొని సీరియస్‌గా.. నా దగ్గరకు మా అమ్మ వచ్చింది. నేను కూడా అంతే సీరియస్‌గా.. దానిని నా బాయ్ ఫ్రెండ్ కోసం తెచ్చానని చెప్పాను. చివరకు మేం మాత్రం వాటిని బుడగల్లా ఊది పగలగొట్టాం.

5. ఇది మరీ కామెడీగా ఉంది

ఎప్పుడైనా నా బాయ్ ఫ్రెండ్ కండోమ్ లేకుండా సెక్స్ చేసుకుందామని అన్నప్పుడు.. పాప లేదా బాబును కనడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు నటిస్తా. దెబ్బకి తిక్క కుదురుతుంది.

Giphy

6. అదే నీకు మంచిదిలే..

ఓసారి నేను వాడేసిన కండోమ్‌ను కిటికీలో నుంచి బయటకు విసిరేశాను. అది వెళ్లి మా నాన్న కార్ మీద పడింది. అది నాదేనని మా నాన్నకి ఇప్పటి వరకు తెలియదు పాపం.

7. ఏంటి నిజమేనా? అసలు ఇలా జరుగుతుందా?

బాగా తాగిన మత్తులో ఉన్నప్పుడు.. నేను ఒకతనితో సెక్స్‌లో పాల్గొన్నాను. నాలుగు రోజుల తర్వాత నా వెజీనాలో కండోమ్ ఇరుక్కుని ఉండటం గమనించాను.

8. ఇది నిజంగానే చాలా మంచి ఐడియా

నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను కలిసి వెళదామని.. మా ఇంటికి వచ్చాడు. నేను కండోమ్ ప్యాకెట్ తెరచి అందులో కొద్దిగా బాడీ లోషన్ వేసి బాత్రూమ్ డస్ట్ బిన్లో పడేశా. ఎందుకంటే అది చూసిన అతగాడు బాగా కుళ్లుకుంటాడుగా..

Giphy

9. నేను అస్సలు వారిని మిస్సవ్వను

నేను లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాను. ఎవరైనా అబ్బాయి చాలా హాట్‌గా కనిపిస్తే.. అతను తీసుకెళ్లే పుస్తకంలో నేను కండోమ్ పెడతా. కండోమ్ పెట్టిన పేజీ నంబర్ వారికి చెప్పి.. ఆ పేజీ కచ్చితంగా చదవమని చెప్తా. అలా ఇప్పటి వరకు ఎనిమిది మందికి ఇచ్చా.

10. ఇలా ఎన్ని రోజులు కవర్ చేస్తావు? ఎప్పడో ఒకప్పుడు తెలిసిపోతుందిగా

నా ఫ్రెండ్స్ మా ఇంటికి రావడానికి ముందు నేనేం చేస్తానో తెలుసా? ఖాళీ కండోమ్ ప్యాకెట్లు అక్కడక్కడా విసిరేస్తాను. ఎందుకంటే వాటిని చూసి నేను చాలా డిఫరెంట్ అని వారు అనుకోవాలి కదా.

ఇవి కూడా చదవండి:

ధైర్యం చేసి కండోమ్ కొనే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..!

కన్సెంట్ కండోమ్ ప్యాకెట్ తెరవడానికి ఇద్దరు కావాలి. ఎందుకో తెలుసా?

ఫిమేల్ కండోమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..                                      

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది