ADVERTISEMENT
home / Celebrity Life
ప్రభాస్ “సాహో” ఫస్ట్ సాంగ్.. “ఆగడిక సైకో సయ్యా” లిరిక్స్ మీకోసం..!

ప్రభాస్ “సాహో” ఫస్ట్ సాంగ్.. “ఆగడిక సైకో సయ్యా” లిరిక్స్ మీకోసం..!

ప్రభాస్ నటించిన ‘సాహో’ (Saaho) సినిమా ప్రమోషన్స్ ఒక్క లెక్కలో ఊపందుకుంటున్నాయి. ఆగస్టు 15, 2019 తేదిన (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని తొలి సాంగ్  ‘సైకో సయ్యా’ టీజర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ పాట రికార్డుస్థాయిలో వ్యూస్ కైవసం చేసుకుంటోంది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఈ సాంగ్‌లో ప్రధాన ఆకర్షణ. బ్లాక్ డ్రెస్సులో స్టైలిష్ డ్యాన్సర్‌గా రెచ్చిపోయి ఆడిపాడిన ఈ భామ.. హీరో ప్రభాస్‌తో పోటీ పడి మరీ డ్యాన్స్ చేయడం విశేషం. 

తనిష్క్ బాగ్చి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సాంగ్‌ని.. ధ్వని భానుశాలి పాడారు. ఈ సాంగ్ స్పానిష్ పాటల శైలిని పోలి ఉందని ఇప్పటికే పలువురు చెబుతున్నారు. అయితే ఇదే పాట ప్రభాస్ (Prabhas), శ్రద్ద జోడికి పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ అని ఇట్టే చెప్పేయవచ్చు. సుజీత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రాన్ని రూ.250 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రభాస్ ‘సాహో’ టీజర్‌లో.. మీరు చూడాలనుకునే ‘7’ అంశాలు ఇవేనా!

ఈ సాంగ్ పూర్తి లిరిక్స్ మీకోసం

ADVERTISEMENT

తేరా మే తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే
తేరా మే తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే

పగలే నీకు చుక్కలు ఇన్ ద స్కై
రేయి అంతా మింగే నిదురని కలలై
నషా మే నన్ను ముంచు ఇక.. డోంట్ బీ షై
ఆశే మన మనసులో వైకో వైకో
ఎదురు పడే కళ్లతో మెస్మరైజ్
వల్లనే నీతోనే నీచే కీ హై

ఓ చురా కైసే దిల్ కో తుఫాయే ఫ్లై
ఆజా నువ్వు నేను చల్ జైకో జైకో
ఓ సయ్యా సయ్యా వే 
నా సరసకి సయ్యా వే
నీ చూపులే వెయ్య గుండెని కొయ్య
దిల్ జరా కాసుకో కాసుకో
ఆగడిక సయ్యా సైకో

ఆగడిక సయ్యా సైకో 
తేరా మే తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే
తేరా మే తేరా మే తేరా మే తేరా మే
డబీ డబీ ధమ్ మే

ADVERTISEMENT

తలకిందులు చేసే మాయేదో
చూపించవే నీ మాటల్లో
తలకిందులు చేసే మాయేదో 
చూపించవే నీ మాటల్లో
కంగారు ఎందుకు.. లెట్స్ టేక్ ఇట్ స్లో
నిజమేనా ఈ కలలు
ఓ సయ్యా సయ్యా రే
నీకోసం తయ్యారే
నీకెప్పుడో ఎర వేశా
వదలను నిన్నే మన కథ
రాసుకో రాసుకో
ఆగడిక సయ్యా సైకో

 

#15AugWithSaaho సాహో సినిమాపై ఆసక్తిని.. మరింత పెంచే విశేషాలు మీకోసం..!

ఈ “ఆగడిక సైకో సయ్యా” సాంగ్‌ని పార్టీ యాంథమ్ సాంగ్‌గా పలువురు పేర్కొంటున్నారు. ఈ సాంగ్‌కి రాజు సుందరం, వైభవి మర్చంట్ కంపోజ్ చేసిన స్టెప్స్ చాలా వైవిధ్యంగా ఉన్నాయి. సాహో చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి తొలుత శంకర్ ఇషాన్ లాయ్‌లను సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత వారు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి వారి తర్వాత.. ఆ బాధ్యతలను నిర్మాతలు ఎవరికి అప్పగించారన్న విషయం పై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారమూ రాలేదు. 

ADVERTISEMENT

కానీ విడుదలైన మొదటి పాటకే అనుకోని ఫాలోయింగ్ రావడం మాత్రం విచిత్రమనే చెప్పుకోవాలి. అయితే ఈ సాంగ్ పూర్తి స్థాయి బాలీవుడ్ స్టైల్‌లోనే సాగడం గమనార్హం. శ్రీజో ఈ పాటకు లిరిక్స్ సమకూర్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ నాలుగు భాషల్లోనూ విడుదలైంది. అయితే తమిళ, తెలుగు వెర్షన్లకు మాత్రం అనిరుధ్ రవిచందర్ కూడా గొంతు కలిపారు. హిందిలో మాత్రం ధ్వని, తనిష్క్‌‌లతో పాటు సచిన్ టాండన్ కూడా పాడారు. మలయాళంలో సచిన్, అనిరుధ్ స్థానాలను యజిన్ నిజార్ భర్తీ చేశారు. అలాగే హిందీ లిరిక్స్‌ను తనిష్కే రాశారు. 

‘సాహో’లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ పై.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

మలయాళంలో మాత్రం ఈ పాట లిరిక్స్‌ను వినాయక్ శశికుమార్ రాయగా.. తమిళ వెర్షన్ పాటను మదన్ కార్కీ రాశారు. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్, తమిళ, మలయాళ నటులతో పాటు వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సుప్రీత్, నవీన్ వర్మ, శివక్రిష్ణ, కుమార్ రాజా వంటి టాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఆగస్టు 2017లో మొదలవ్వగా.. ఆస్ట్రియా, హైదరాబాద్, ముంబయి, అబుదాబి, రోమానియాలతో పాటు యూరోప్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సాహో సినిమా షూటింగ్ జరిగిందనే విషయం తెలిసిందే కదా. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

 

 

ADVERTISEMENT
08 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT