హైదరాబాద్ ట్రెండ్స్: బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ కోసం వెతుకుతున్నారా..? ఈ లిస్ట్ చెక్ చేయండి

హైదరాబాద్ ట్రెండ్స్: బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ కోసం వెతుకుతున్నారా..? ఈ లిస్ట్ చెక్ చేయండి

అద్భుతమైన సెట్టింగ్స్, అందమైన పూల డెకరేషన్ మధ్య అచ్చం సినిమాలో మాదిరిగా పెళ్లి చేసుకోవాలని ఉందా? పెళ్లి (marriage) విషయంలో మీ కలల్ని నిజం చేయడానికే వెడ్డింగ్ ప్లానర్స్ (wedding planners) ఉన్నారు. మీకు పెళ్లి దుస్తులు ఎంపిక చేయడం దగ్గర నుంచి పెళ్లి కార్డుల ప్రింటింగ్ వరకు, పెళ్లి వేదికను ఎంపిక చేయడం దగ్గర నుంచి.. అతిథులకు మర్యాదలు చేయడం వరకు అన్నింటినీ దగ్గరుండి చక్కగా పూర్తి చేస్తారు. అంతేకాదు.. మీ బిగ్ డేను మీ లైఫ్‌లో బెస్ట్ డేగా మార్చేస్తారు. అలాంటి వెడ్డింగ్ ప్లానర్స్ గురించి మీరూ వెతుకుతున్నారా? అయితే హైదారాబాద్‌లో (Hyderabad) టాప్ 10 బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్స్ గురించి తెలుసుకుందాం.

ది వెడ్డింగ్ ప్లానర్స్ (The Wedding Planners)

పెళ్లి పందిట్లోకి దారి చూపే ఎంట్రన్స్ నుంచి, పెళ్లి మండపం వరకు.. చాలా గ్రాండ్‌గా, చూడగానే అతిథులందరూ మెచ్చే విధంగా తయారు చేస్తారు "ది వెడ్డింగ్ ప్లానర్స్" .. మీ అవసరాలు, మీ బడ్జెట్.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీకు నచ్చినట్టుగా, మీరు మెచ్చేట్టుగా పెళ్లికి సంబంధించిన అన్ని పనులనూ పూర్తి చేస్తారు.

వివిధ్ వెడ్డింగ్ అండ్ ఈవెంట్ ప్లానర్స్ (Vividh Wedding and Event Planners)

పెళ్లి వేదికను సిద్ధం చేయడం, దాని కోసం అద్భుతంగా డెకరేట్ చేయడంతో పాటు.. పెళ్లి సరదాగా  సాగిపోయేలా అన్ని ఏర్పాట్లు చక్కగా పూర్తి చేస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ సంప్రదాయానికి విలువనిస్తూనే కొత్తదనం, వైవిధ్యం ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తారు. సంగీత్, పెళ్లి ఏదైనా సరే.. దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో వివిధ్ వెడ్డింగ్ అండ్ ఈవెంట్ ప్లానర్స్ వారిది అందె వేసిన చేయి.

Facebook

యెల్లో ప్లానర్స్(Yellow Planners)

నేటి తరం ఆలోచనలకు తగినట్టుగా, పెళ్లి విషయంలో మీకున్న ఫాంటసీలను నిజం చేసుకోవాలనుకుంటే.. యెల్లో ప్లానర్స్ పర్ఫెక్ట్ ఎంపిక. వారు వేసే సెట్టింగ్స్ అదరహో అనిపిస్తాయి. పెళ్లి, సంగీత్ లాంటివి మాత్రమే కాకుండా.. బర్త్ డే పార్టీలు సైతం చక్కగా అరేంజ్ చేస్తారు.

మాన్ ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Maan Events & Entertainments)

నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి, రిసెప్షన్ వరకు ప్రతిదాన్ని చక్కగా ప్లాన్ చేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ మాన్ ఈవెంట్స్. పెళ్లి వేదికను సిద్ధం చేయడంలో  ఈ సంస్థ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. మీరు కోరుకున్న థీమ్‌కు తగినట్టుగా అన్నింటినీ సిద్ధం చేస్తారు.

అలంకరణ్ వెడ్డింగ్స్ (Alankaran Weddings)

మోడరన్, ట్రెడిషనల్ డిజైన్లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. పెళ్లి వేదికలను సిద్ధం చేస్తుంది అలంకరణ్ డిజైన్స్. డ్రీమ్ క్యాచర్స్, ఫ్లవర్స్, ఫెయిరీ లైట్స్, లాంతర్లతో అద్భుతమనిపించేలా మీ పెళ్లి వేదికను వీరు సిద్ధం చేస్తారు. ఈ వెడ్డింగ్ ప్లానర్స్‌కున్న మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఫొటోలు దిగడం కోసం ప్రత్యేకంగా అందంగా డెకరేట్ చేసిన ఫొటో బూత్.

Facebook

మారిగోల్డ్ వెడ్డింగ్స్ (Marigold Weddings)

చిన్నదే అయినా.. చాలా ప్రతిభ కలిగిన టీమ్ మారిగోల్డ్ వెడ్డింగ్స్‌కు ఉంది. మీ ఆలోచనలు, అభిరుచులకు తగినట్లుగా ప్లాన్ చేయడంలోనూ, దాన్ని అమలు చేయడంలోనూ పక్కాగా వ్యవహరిస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని చక్కగా  ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. అంతేకాదు.. హనీమూన్ ప్లానింగ్ విషయంలోనూ మీకు సహకరిస్తారు.

వెడ్డింగ్స్ ఎన్ మోర్ (Weddings N More)

ఈ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ఇప్పటి వరకు.. సుమారుగా 800 పైగా పెళ్లిళ్లకు వెడ్డింగ్ ప్లానర్స్‌గా పనిచేశారు. వెడ్డింగ్స్ ఎన్ మోర్.. మీ పెళ్లి  రోజును ఎప్పటికీ మరిచిపోలేని విధంగా మార్చేస్తుంది.

ఫెయిరీ టేల్ వెడ్డింగ్స్ ఇండియా (Fairytale Weddings India)

పేరుకు తగినట్టుగానే.. ఈ వెడ్డింగ్ ప్లానర్స్ మీ పెళ్లిని ఫెయిరీ టేల్ అంత అందంగా మార్చేస్తారు. ప్రత్యేకమైన పువ్వుల డెకరేషన్ చేసి.. మీ వెడ్డింగ్ ఫాంటసీని నిజం చేస్తారు ఈ వెడ్డింగ్ ప్లానర్స్.

Facebook

రచనోత్సవ్ - ది వెడ్డింగ్ ప్లానర్స్ (Rachnoutsav – The Wedding Planners)

మీ బడ్జెట్‌కు తగినట్లుగా.. టెక్నాలజీని వాడుకుని మీ పెళ్లిని గ్రాండ్‌గా చేయడంలో రచనోత్సవ్ వెడ్డింగ్ ప్లానర్స్‌కు మంచి పేరుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో.. మీ పెళ్లికి ప్రత్యేక కవరేజ్ ఇస్తారు. మీ కోసమే ప్రత్యేకమైన హ్యష్ ట్యాగ్ క్రియేట్ చేసి పెళ్లికి పబ్లిసిటీ ఇస్తారు.  మీ పెళ్లికి రాలేకపోయిన మీ స్నేహితులకు లైవ్ వీడియో ద్వారా పెళ్లిని చూసే ఏర్పాట్లు చేస్తారు.

మోక్స్ ఇంటరాక్టివ్ ఈవెంట్స్ (Moksh Interactive Events)

టెడెక్స్, మేకర్ ఫెయిర్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లను హ్యాండిల్ చేసిన అనుభవం ఈ వెడ్డింగ్ ప్లానర్స్‌కి ఉంది. వీరి చేతిలో మీ పెళ్లి పనులను పెడితే.. మిగిలిన పనులు మీరు హాయిగా చూసుకోవచ్చు. పెళ్లికి మంచి కల్యాణ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు.. చిన్న లోపం కూడా జరగకుండా పెళ్లి పనులన్నింటినీ పూర్తి చేస్తారు.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.