12 ఆగస్టు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

12 ఆగస్టు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 12, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ప్రేమికులకు బాగా కలిసొచ్చే రోజు. ముఖ్యంగా మీ బంధం గురించి ఇంట్లో వాళ్లకి చెప్పడానికి అనువైన రోజు. అలాగే వివాహితులు తమ తోబుట్టువుల నుండి సహాయాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే ఉద్యోగులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశముంది. 

వృషభం (Tarus) – ఈ రాశి వ్యక్తులు ఈ రోజు పలు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. నిరుద్యోగులు కాస్త కష్టపడితే.. అనుకోని అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక పురోగతి ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామి విషయంలో కాస్త ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. మనస్పర్థలు వచ్చినా... తన వైపు నుండి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక ఖర్చుల విషయంలో, అకౌంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు మంచి పురోగతి ఉంటుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపరిచితుల విషయంలో కూడా అప్రమత్తతతో ఉండాలి. ఉద్యోగులు సాధ్యమైనంత వరకూ వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో డీల్స్ చేసే క్రమంలో ఆచితూచి వ్యవహరించాలి. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఆస్తి పంపకాలు లేదా వాటికి సంబంధించిన లావాదేవీలు చర్చకు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సమయస్ఫూర్తితో, వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటే మంచిది. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు డయాబెటిస్, బీపీ, అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తతతో ఉండండి. ఉద్యోగస్తులు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఉంటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) – ఈ రోజు స్టాక్ మార్కెట్ రంగంలోని వ్యక్తులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు సంభవించే అవకాశముంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులు తమ భాగస్వామితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా మీరు నిజాయతీగా ఉన్నంత కాలం.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. వివాహితులు భాగస్వామితో విభేదాలు వచ్చినా.. వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నుండి విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు నిర్లక్ష్యాన్ని వీడి.. కష్టపడి చదవడానికి ప్రయత్నించండి. అనుకోని అవకాశాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో ఎంతో ఒత్తిడికి గురవుతారు. వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి కూడా ప్రయత్నించవచ్చు. 

మకరం (Capricorn) – ఈ రోజు వ్యాపారస్తులకు మంచి పరిణామాలు ఎదురవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వివాహితులకు తమ భాగస్వామితో బంధాలు బలంగా ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి.. మంచి విషయాలు వింటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ రోజు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

కుంభం (Aquarius) - ఈ రోజు వ్యాపారస్తులు ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులు కూడా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆదాయ, వ్యయాలకు సంబంధించి స్వయం నియంత్రణ ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 

మీనం (Pisces) – ఈ రోజు నిరుద్యోగులు సిఫార్సులతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తమ ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. వివాహితులు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.