వన కన్యలా మెరిసిన గీతా మాధురి.. తన మెటర్నిటీ ఫొటోషూట్ చూశారా?

వన కన్యలా మెరిసిన గీతా మాధురి.. తన మెటర్నిటీ ఫొటోషూట్ చూశారా?

గీతా మాధురి (Geetha madhuri).. తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న సింగర్ ఆమె. 2014లో నటుడు నందుని (Nandu) పెళ్లాడిన గీతామాధురి.. ఓ బిడ్డకు తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరిగిన ఆమె సీమంతం ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణ పద్ధతిలో జరిగిన ఈ సీమంతం వేడుకలో గీతా మాధురి స్నేహితులు.. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖలు పాల్గొన్నారు.

Facebook
తల్లి కాబోతున్న గీతామాధురి.. సీమంతం ఫొటోలతో అందరికీ సర్ ప్రైజ్..!

ముఖ్యంగా ఈ సీమంతం వేడుకలో గీతామాధురి స్నేహితులు సింగర్స్ పర్ణిక, అంజనా సౌమ్య, మాళవిక.. యాంకర్లు శ్యామల, దీప్తి పాల్గొన్నారు. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో పెద్దగా ఫోటోలు షేర్ చేయని గీతా మాధురి.. సీమంతం తర్వాత మాత్రం తన ఫొటోలను రోజూ పోస్ట్ చేయడం విశేషం. రకరకాల దుస్తులు, చీరల్లో ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేస్తూ వస్తోంది.

తాజాగా నందుతో కలిసి మెటర్నిటీ ఫోటోషూట్ (maternity photoshoot)లో పాల్గొన్న గీతా మాధురి దానికి సంబంధించిన చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. నిండు గర్భిణిగా ఎత్తైన పొట్టతో ఉన్న గీత అద్భుతమైన మెటర్నిటీ షూట్ ఫొటోలను పోస్ట్ చేసింది. తన బేబీ బంప్‌ని చూపుతూ రంగురంగుల మ్యాక్సీలను ధరించి ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆమెతో పాటు భర్త నందు కూడా కొన్ని ఫొటొల్లో కనిపించడం విశేషం. ఈ ఫొటోల్లో రంగురంగుల దుస్తులు, రంగురంగుల కిరీటాలతో వనకన్యగా మెరిసింది గీత. 

facebook

ఈ ఫొటోషూట్‌లో భాగంగా నీలం రంగు వన్ షోల్డర్ మ్యాక్సీ శారీ గౌన్ పై.. తెలుపు రంగు పూల కిరీటం పెట్టుకొని వనకన్యలా కనిపించింది గీత.

Facebook
అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

మరో ఫొటోలో పసుపు రంగు మ్యాక్సీ వేసుకొని.. అలాగే పచ్చల హారం ధరించి నీలం, పసుపు రంగులు మిక్స్ చేసిన పూలతో చేసిన కిరీటాన్ని పెట్టుకొని అద్భుతంగా కనిపించింది. దీంతో పాటు దిగిన కొన్ని ఫొటోల్లో నందు కూడా పాల్గొన్నాడు. అందులో నందు తెలుపు రంగు సూట్‌లో కనిపించడం విశేషం. 

Facebook

ఇక తెలుపు రంగు మ్యాక్సీ వేసుకొని.. గులాబీ రంగులో ఉన్న పూల కిరీటం పెట్టుకున్న ఫొటోలో ఆమెతో పాటు నందు కూడా తెలుపు డ్రస్ వేసుకొని పెసర రంగు బ్లేజర్ వేసుకొని కనిపించాడు.

అండర్ వాటర్ ఫొటోషూట్‌తో.. అబ్బురపరుస్తోన్న సమీరా రెడ్డి..!
Facebook

ఈ ఫోటోల్లో గీత కాబోయే తల్లికి ఉండే అందమైన మెరుపుతో కనపించింది. ఈ ఫొటోలు చూస్తుంటే నందు, గీతామాధురి ఇద్దరూ కాబోయే బిడ్డ కోసం చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారనిపిస్తోంది. మోడ్రన్ దుస్తులు వేసుకున్నా.. సీమంతం గాజులు తీయకపోవడం చూస్తుంటే ఆమె సంప్రదాయానికి ఇచ్చే విలువను తెలుసుకోవచ్చు. మెటర్నిటీ ఫొటోషూట్ చూసిన అభిమానులందరూ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేయడం విశేషం.

29 సంవత్సరాల గీత 2014లో నందును వివాహమాడింది. పెళ్లికి ముందే సింగర్‌గా మంచి పేరు సంపాదించిన గీతామాధురి పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌లో దూసుకుపోయింది. తన పాటలతో మంచిపేరు సంపాదించుకోవడంతో పాటు.. బిగ్‌బాస్ 2లో పాల్గొని అభిమానులను సైతం పెంచుకుంది. బిగ్‌బాస్ షో గెలవలేకపోయినా.. రన్నరప్‌గా నిలిచి అందరి మనసులను గెలిచింది గీత. బిగ్‌బాస్‌లో పాల్గొని.. అభిమానుల మనసులు దోచుకోవడంతో పాటు.. మంచి స్నేహితులను కూడా సంపాదించుకుంది గీతా మాధురి. 

Facebook

ఈటీవీలో ప్రసారమైన సై సింగర్స్ ఛాలెంజ్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గీతామాధురి. కులశేఖర్ దర్శకత్వం వహించిన "ప్రేమలేఖ రాశా" చిత్రంలో పాట పాడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. మగధీర చిత్రంలోని ధీర ధీర ధీర పాటతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో 500 కి పైగా పాటలు పాడడంతో పాటు కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.