అండర్ వాటర్ ఫొటోషూట్‌తో.. అబ్బురపరుస్తోన్న సమీరా రెడ్డి..!

అండర్ వాటర్ ఫొటోషూట్‌తో.. అబ్బురపరుస్తోన్న సమీరా రెడ్డి..!

సమీరా రెడ్డి (Sameera reddy).. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ అద్భుతమైన సినిమాలతో ఆకట్టుకున్న అందాల నటి. అక్షయ్ వర్దే అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వనుందన్న సంగతి మనకు తెలిసిందే. ప్రెగ్నెన్సీ మొదటి రోజు నుంచీ ఇప్పటివరకూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ వస్తోందీ  బ్యూటీ.

తన బేబీ బంప్‌ని బయటకు చూపడానికి సైతం ఏమాత్రం వెనుకాడలేదు సమీర. కాఫ్తాన్స్, మోనోకిన్స్.. వంటివి ధరిస్తూ అద్భుతంగా కనిపించే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా వచ్చిన ఆమె సీమంతం ఫొటోలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

Instagram

తాజాగా తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టింది సమీర. ఈ సందర్బంగా నీటి లోపల (అండర్ వాటర్) ఫోటోషూట్ (photoshoot) చేయించుకొని.. ఆ చిత్రాలను షేర్ చేసింది. తొమ్మిదో నెల గర్భంతో అద్భుతంగా కనిపిస్తున్న తన చిత్రాలను ఎప్పటికీ పదిలంగా దాచుకోవాలని భావించానని.. అందుకే ఫొటో షూట్ చేయించుకున్నానని చెబుతోందామె.

రంగురంగుల బికినీలు, క్లాత్స్‌తో చేయించుకున్న ఈ ఫొటోషూట్‌ చిత్రాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీటిని షేర్ చేస్తూ "తను నీటి లాంటిది. నిన్ను ముంచేంత శక్తి గలది. కడిగి పునీతం చేసేంత నిర్మలమైనది. నిన్ను రక్షించేంత లోతైనది.." అంటూ ఓ కవితను పోస్ట్ చేసింది.

Instagram

నియాన్ గ్రీన్ రంగులో ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేస్తూ "తొమ్మిదో నెలలో నా బేబీ బంప్‌తో నా అందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. ఈ సమయంలో గర్భిణులు అలసటగా, భయపడుతూ, రాబోయే కాలం గురించి ఆలోచించి కంగారు, ఎక్సయిట్‌మెంట్ వంటివన్నీ ఫీలవుతూ ఉంటారు.

ఆ సమయాన్ని మీతో కలిసి పంచుకోవాలనుకున్నా. ఈ పాజిటివిటీ మీలోనూ నిండాలని.. జీవితంలో వివిధ దశల్లో.. వివిధ సైజుల్లో ఉన్న మీరందరూ మీ శరీరాన్ని ప్రేమిస్తూ మనల్ని మనం ఎలా ఉన్నా స్వీకరించాలని నేను కోరుకుంటున్నా" #imperfectlyperfect అంటూ క్యాప్షన్ జోడించింది.

Instagram

మరో ఫొటో పోస్ట్ చేస్తూ వీటికి ఫొటోషాప్ కానీ, టచప్ కానీ, ఫిల్టర్ కానీ వాడలేదని చెప్పుకొచ్చింది. గతంలో తన ప్రెగ్నెన్సీ ఫొటోలు షేర్ చేసినందుకు చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. వారి గురించి కూడా ఓ పోస్ట్ పెట్టిందామె. "తన ఆత్మ చాలా లోతైనది. కేవలం పైపైన ఈదేవాళ్లు తనని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. నా ప్రెగ్నెన్సీ ఫొటోలు చూసి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి కోసం నేను చెప్పే సమాధానం ఇది" అంటూ చెప్పుకొచ్చింది.

Instagram

గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ట్రోలర్స్‌కి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది సమీర. "ఈ ట్రోలర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి కడుపులోంచే కదా. అలాంటి సహజమైన ప్రక్రియ గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు. గర్భం ధరించడం ఓ సహజ ప్రక్రియ. అదెంతో అందమైనది, అద్భుతమైనది కూడా. ఈ సమయంలోనూ అందంగా బయటకొచ్చే కరీనా లాంటివాళ్లు కొందరుంటే.. నాలా కాస్త సమయం తీసుకొని దాన్ని ఆనందించే వాళ్లు కూడా చాలామందే ఉంటారు" అని చెప్పుకొచ్చింది.

Instagram

తాజాగా సమీర పెట్టిన ఈ ఫొటోలకు మాత్రం మంచి స్పందనే వస్తోంది. ఈ ఫొటోలు ఎంతో అద్బుతంగా ఉన్నాయని అంతా చెప్పడం విశేషం. కొందరైతే ఈ సమయంలో ఎలాంటి బ్రీతింగ్ సదుపాయాలు లేకుండా.. అండర్ వాటర్ ఫొటోషూట్ చేయడం పట్ల ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూస్తే సమీర తన ప్రెగ్నెన్సీని అద్భుతంగా ఎంజాయ్ చేస్తోంది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది. కేవలం ఎంజాయ్ చేయడమే కాదు.. తనలాంటివారికి సలహాలిస్తూ.. ట్రోలర్స్‌కి గట్టిగా సమాధానం చెబుతూ ప్రెగ్నెన్సీని పవర్‌ఫుల్‌గా చూపుతోంది సమీర.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

 

అమ్మతనంలోని ఆనందం ఇదే.. తన సీమంతం ఫోటోలు షేర్ చేసిన సమీరారెడ్డిమీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్