ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3 : మరోసారి నామినేషన్స్‌లోకి పునర్నవి & హిమజ

Bigg Boss Telugu 3 : మరోసారి నామినేషన్స్‌లోకి పునర్నవి & హిమజ

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో (Bigg boss Telugu)  ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో ఉన్న 11 సభ్యులలో.. 6  సభ్యులు ఈ సారి నామినేషన్స్‌లో ఉండడం జరిగింది. అయితే ఈ సారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త ఆసక్తికరంగా సాగింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్

అదెలాగంటే – బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇంటి కెప్టెన్ అయిన శివజ్యోతిని మినహాయించి మిగతా ఇంటి సభ్యులైన 10 మంది తమకి నచ్చిన ఒకరితో జంటగా మారి.. ఆ విషయాన్ని బిగ్ బాస్‌కి తెలపమన్నారు. అలా జంటలుగా మారిన వారిలో.. ఒకరిని ఇంటి సభ్యులు సేఫ్ చేయాలి. అలాగే ఇంకొకరిని నామినేట్ చేయాలి.

ఆ ప్రక్రియలో భాగంగా వరుణ్ సందేశ్, పునర్నవిలలో .. పునర్నవికి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె నామినేట్ అయ్యారు. అలాగే హిమజ, శ్రీముఖిలలో… హిమజ నామినేట్ అవ్వగా, బాబా భాస్కర్, మహేష్ విట్టాలలో… బాబా భాస్కర్‌కి ఎక్కువమంది మద్దతు పలకడంతో.. మహేష్ విట్టా నామినేషన్స్‌లోకి వెళ్లారు

ADVERTISEMENT

అలాగే అలీ రెజా, రవిక్రిష్ణలలో ఎక్కువశాతం.. రవికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన నామినేట్ అయ్యారు. అదే సమయంలో రాహుల్ సిప్లిగంజ్, వితికలకి సమానంగా ఓట్లు రావడంతో ఇంటి కెప్టెన్ అయిన శివజ్యోతి నిర్ణయం ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ నామినేట్ అయ్యారు. 

ఈ ప్రక్రియ మొత్తానికి ట్విస్ట్ ఏంటంటే – సేఫ్ అయిన వారిలో ఎవరినో ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం శివజ్యోతికి ఇవ్వడం. ఈ క్రమంలో ఆమె వరుణ్ సందేశ్‌ని నామినేట్ చేయడం జరిగింది. దానితో 11 మంది హౌస్ మేట్స్‌లో 6 సభ్యులు నామినేట్ అయ్యారు. వారే – పునర్నవి (Punarnavi), హిమజ (Himaja), మహేష్ విట్టా, రవికృష్ణ, వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్.

Bigg Boss Telugu 3: అషు రెడ్డి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..?

ఇక తొలిసారిగా ఈ షోలో “బిగ్ బాస్ వీక్లి”ని  ఇంటిలోకి పంపడం జరిగింది. ఆ వీక్లిలో ఇప్పటివరకు ఇంటి సభ్యుల గురించి బయట వినిపిస్తున్న టాక్‌ని గురించి ప్రస్తావించారు. ఈ టాక్‌లో ముఖ్యంగా బాబా భాస్కర్ వంటల ప్రస్తావన రావడం విశేషం. 

ADVERTISEMENT

అలాగే అలీ రెజా చేసిన డ్యాన్స్ చూసి ఎంతోమంది అమ్మాయిలు మతిస్థిమితం కోల్పోయారని.. అలాగే ఆ డ్యాన్స్ మూమెంట్స్‌కి వర్షాకాలం కూడా ఎండాకాలంగా మారిపోయిందని పేర్కొన్నారు. 

అలాగే రవికృష్ణ మీసాలు తిరిగి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేస్తున్నారని.. అలాగే రవి తన డ్యాన్స్ భంగిమలతో అమ్మాయిలని ఉర్రుతలూగించగా.. వారు ఇంకా ఊగుతూనే ఉన్నారని వీక్లీలో తెలిపారు. 

అలాగే ఈరోజు నామినేషన్స్‌లో ఎవరెవరుంటారు? బిగ్‌బాస్ ఇల్లు రెండు గ్రూపులుగా విడిపోయిందా? రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి, అలీ, శ్రీముఖి, బాబా భాస్కర్, హిమజలలో ఎవరు ఎలా ముందుకు సాగుతారు? పునర్నవి ఎవరి పై మనసు పారేసుకుంది?

ఇలాంటి టైటిల్స్‌తో బీబీ వీక్లిలో వచ్చిన వార్తలు చదివి.. నిజంగానే హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. కొత్తగా కూడా ఫీలయ్యారు.

ADVERTISEMENT

అవును మరి! అసలు ఎవరు ఊహించని విధంగా.. ఇలా ఇంటి సభ్యుల గురించి బయట మాట్లాడుకొనే విషయాలు వారే వింటే.. పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఈ కాన్సెప్ట్. మరి ఈ వార్తల వల్ల.. ఇంటి సభ్యులలో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది..? ఈ వారం గడిస్తే కానీ చెప్పలేం. 

చివరిగా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో ఆరవ వారానికి సంబంధించి నామినేట్ అయిన వారిలో.. ఈ వారం ఇంటి నుండి ఎవరు వెళతారు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం వంటివి ప్రోమోలో చూపించారు. మరి అది టాస్క్‌లో భాగంగా జరిగిందా? లేక మరేదైనా ఎత్తుగడ ఉందా? అనేది ఈరోజు తెలుస్తుంది.

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

27 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT