బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ప్రస్తుతం ఐదో వారంలో ఉంది. అలాగే పోయిన వారం నాగార్జున ఇంటి సభ్యులతో మీ మాస్క్‌లు తీసేసి గేమ్ ఆడండి అనడం వల్లనో లేదా వేరే ఇంకేవైనా కారణాల వల్లనో.. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల మధ్య మనస్పర్థలు తీవ్రతరమయ్యాయి. ముఖ్యంగా అలీ రెజా & మహేష్ విట్టాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది పరిస్థితి.

బిగ్‌బాస్ తెలుగు 3 : టాలెంట్ షోలో చిందేసిన హౌస్ మేట్స్

తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ సూచన మేరకు.. ఇంటిలోని సభ్యులు తోటి వారిపై ఎటువంటి ఫిర్యాధులైన ఉంటే, వాటిని కోర్ట్ యార్డ్‌లో ఉంచిన కార్డు పై ఫిర్యాదు రాసి అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలి. ఈ తరుణంలో ఎక్కువ శాతం ఫిర్యాదులు మహేష్ విట్టా & రాహుల్ సిప్లిగంజ్ పైనే వచ్చాయి.

అయితే ఇంటి కెప్టెన్ అయిన శివజ్యోతి ఆధ్వర్యంలో ఆ కార్డులని తెరిచి అందులోని ఫిర్యాదుల పైన చర్చించమన్నారు బిగ్‌బాస్. ముందుగా మహేష్ విట్టా విషయంలో అలీ రెజాతో పాటూ పునర్నవి కూడా కార్డు పై ఫిర్యాదు రాసింది. ఈ సందర్భంగా చెలరేగిన మాటలు ఒకానొక స్థితిలో హద్దులు కూడా దాటాయి. వీరిద్దరినీ వారించేందుకు శివజ్యోతి చేసిన ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదు. అనంతరం పునర్నవి చేసిన ఫిర్యాదు గురించి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

మహేష్ విట్టా తరువాత ఎక్కువగా ఫిర్యాదులు వచ్చింది రాహుల్ సిప్లిగంజ్ పైనే.. ఈ క్రమంలోనే గత మూడు వారాల నుంచి శ్రీముఖి & రాహుల్‌ల మధ్య జరుగుతున్న గొడవ మరొకసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ అంశం పైన తన వెర్షన్ చెప్పడానికి ప్రయత్నించిన రాహుల్ సిప్లిగంజ్ మాటలు వినడానికి శ్రీముఖి ఆసక్తి చూపలేదు. అలాగే ఈ ఇద్దరూ కూడా వారి మధ్య జరిగిన దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేయట్లేదు అని అర్ధమైంది. చివరికి.. ఈ నలుగురినీ తమ మధ్య ఉన్న విభేదాలను వారంతట వారే చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిందిగా ఇంటి కెప్టెన్ అయిన శివజ్యోతి కోరింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా మోసం చేశాడని.. కంటితడి పెట్టిన బాబా భాస్కర్ ..!

ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ & మహేష్ విట్టాల పై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చిన కారణంగా వీరిద్దరినీ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు జైలులో పెట్టడం జరుగుతుంది అని బిగ్‌బాస్ తెలిపారు. అలా ఈ ఇద్దరూ నిన్న జైలుకి వెళ్లారు. దాంతో ఈ నలుగురి మధ్య మొదలైన గొడవ చివరికి జైలు వరకు వెళ్లి ఆగింది.

ఇదిలావుండగా- అంతకముందు టాలెంట్ షో టాస్క్‌లో భాగంగా లెవెల్ 1 నుంచి నలుగురు సభ్యులు - మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, అలీ రెజా & రవిక్రిష్ణలు లెవెల్ 2కి చేరుకున్నారు. ఇక లెవెల్ 2లో ఈ నలుగురు తమ టాలెంట్స్‌ని చూపించడం, అందులో ఉత్తమ ప్రదర్శనగా అలీ రెజా నిలవడం జరిగింది. దాంతో అలీ రెజా ఒక వారం రోజుల పాటు ఫీజ్ సెలబ్రిటీ ఆఫ్ ది వీక్‌గా ఉంటాడు. ఈ వారం రోజులు ఇంటి సభ్యులు ఆయనని ఒక సెలెబ్రిటీలా చూడాల్సి ఉంటుంది.

ఈ లెవెల్2 ని ప్రారంభించడానికి ముందు బాబా భాస్కర్ & శ్రీముఖి కలిసి ఒక డ్యూయెట్‌కి డ్యాన్స్ పెర్ఫార్మ్ చేశారు. మగధీర చిత్రంలో బాబా భాస్కర్ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన పాటనే ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో హిమజ ఇంటిలోని వస్తువులని పాడు చేయడం చూపించారు. అయితే ఇది సీక్రెట్ టాస్క్‌లో భాగంగా జరిగిందా? కాదా?? అన్నది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!