ADVERTISEMENT
home / Dating
సెక్స్టింగ్ చేసేటప్పుడు.. ఈ నియమాలు పాటించాల్సిందే..!

సెక్స్టింగ్ చేసేటప్పుడు.. ఈ నియమాలు పాటించాల్సిందే..!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్.. అంటూ సోషల్ మీడియా చుట్టూ ప్రతిఒక్కరూ పరుగులు పెడుతున్న రోజులివి.. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరొకరు టచ్‌లో ఉండేందుకు, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు ఇవే ప్రధాన మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో కొందరు ఈ మాధ్యమాల ద్వారా సెక్స్‌‌కు  (Sex) సంబంధించిన సమాచారం తెలుసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం తమలో నిండిన సెక్సీ ఊహలు, ఆలోచనలకు అక్షరరూపం ఇస్తూ తమ భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్స్‌తో వాటిని పంచుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఇదేమీ కొత్త కాదు కూడా. అయితే ఇలా సెక్స్టింగ్ (sexting) చేసే క్రమంలో ప్రతి అమ్మాయి గుర్తు పెట్టుకోవాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే..

1. జడ్జ్ చేయకండి..

సెక్స్టింగ్ చేసే వారిని లేదా సెక్స్టింగ్ చేయడాన్ని మీరు జడ్జ్ చేయడానికి ప్రయత్నించకండి. సెక్స్‌కు సంబంధించి టెక్స్ట్ చేసే క్రమంలో అవతలి వ్యక్తి ఆలోచనలు ఒక్కోసారి అదుపు తప్పవచ్చు. అలాంటి సందర్భంలో సాధారణ సమయాల్లో బయటకు చెప్పని లేదా మాట్లాడని విషయాల గురించి కూడా వారు మాట్లాడవచ్చు లేదా మీ వద్ద ప్రస్తావించవచ్చు.

అలాగే మరికొన్ని సందర్భాల్లో సెక్స్టింగ్‌లో ఉపయోగించిన పదజాలం కారణంగా మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇలాంటి వాటి గురించి వారికి చెప్పి వారిని అసౌకర్యానికి గురి చేయకండి. సెక్స్టింగ్ అనేది పరస్పరం ఇష్టప్రకారం జరుగుతున్నప్పుడు మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని అంతగా పట్టించుకోకుండా.. అవతలి వ్యక్తి గురించి మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకానీ.. వారిని లేదా వారి మాటలను జడ్జ్ చేయకండి.

ADVERTISEMENT

2. ప్రైవసీ ఉందా?

సెక్స్టింగ్ చేసే క్రమంలో ప్రైవసీ కలిగి ఉండడం కూడా చాలా అవసరం. అందుకే మీ మొదటి ప్రాధాన్యం కూడా దానికే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సెక్స్టింగ్ చేసుకునే మీ ఇద్దరికీ మాత్రమే కాదు.. మీరు పరస్పరం పంపించుకునే సమాచారానికి కూడా ప్రైవసి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకరు పంపిన సమాచారాన్ని మరొకరు స్క్రీన్ షాట్ తీయడం.. వాటిని స్నేహితులు లేదా వేరొకరితో పంచుకోవడం.. వంటివి చేయకూడదు. ఒక వ్యక్తి మనల్ని నమ్మి తన ఫాంటసీల గురించి మనతో పంచుకుంటున్నారంటే ఆ నమ్మకాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనదే అని గుర్తుంచుకోండి. ఆ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయకండి.

లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!

ADVERTISEMENT

 

3. మనసు చెప్పేది నమ్మండి..

మనకు ఉన్న కొన్ని అద్భుతమైన శక్తుల్లో సిక్స్త్ సెన్స్ కూడా ఒకటి. సెక్స్టింగ్ చేసే సమయంలో మీ మనసులో ఆ వ్యక్తి గురించి ఏ మాత్రం ప్రతికూల ఆలోచనలు లేదా భావనలు కలుగుతున్నా.. వెంటనే వారితో చాట్ చేయడం ఆపేయండి. అలాగే ఒక వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు మీ మనసుకు అది సరైంది కాదని అనిపించినా సరే.. మీ మనసు చెప్పే మాటపై నమ్మకం ఉంచి వారిని హద్దుల్లో పెట్టండి. జరగరానిది జరిగి భవిష్యత్తులో బాధపడడం కన్నా ఏ అపాయం రాకుండా ముందే జాగ్రత్తపడడం చాలా ఉత్తమం. ఏమంటారు అమ్మాయిలు??

సెక్స్టింగ్: లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!

ADVERTISEMENT

4. మితంగానే మాట్లాడండి..

సాధారణంగా చాటింగ్ చేసే సమయంలో మనం చాలా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాసి మరీ మన మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. కానీ సెక్స్టింగ్ విషయానికి వచ్చే సరికి మాత్రం మనం పంపించే సందేశాలు వీలైనంత చిన్నవిగానే ఉండేలా చూసుకోవాలి.

ముఖ్యంగా ఒకే ఒక్క వాక్యంలో మీ సమాధానం లేదా మీ మదిలోని భావాలను అవతలివారికి తెలియజేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీతో సెక్స్టింగ్ చేయడాన్ని వారు కూడా ఎంజాయ్ చేసే వీలు ఉంటుంది. మరీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు రాసి పంపితే.. అవతలి వారికి అవి చదవడానికి అసహనంగా అనిపించడంతో పాటు మీతో సెక్స్టింగ్ చేయడం బోరింగ్‌గా అనిపించే అవకాశాలు కూడా లేకపోలేదు.

ADVERTISEMENT

5. మద్యం సేవించి సెక్స్ట్ చేయద్దు..

మద్యం సేవించినప్పుడు చాలామందిఅదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరికైతే ఏం చేస్తున్నారో లేదా ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి తెలియదు. కాబట్టి మద్యం సేవించినప్పుడు మాత్రం సెక్స్టింగ్‌కు దూరంగా ఉండడం మంచిది. లేదంటే మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆ సందేశాలు చదివి మీరే పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నియమం కొత్తగా సెక్స్టింగ్ చేసే వారికి బాగా వర్తిస్తుంది.

సెక్స్ కలలకు అర్థాలెన్నో.. మరెన్నో..!

ADVERTISEMENT

6. అక్షరాలనే బొమ్మలుగా..

సెక్స్టింగ్ చేసే క్రమంలో చాలామంది అక్షరరూపంలోనే తమ మదిలోని భావాలు, ఊహలను కూడా పంచుకుంటూ ఉంటారు. మీరూ అంతేనా?? అయితే ఈసారి మీ భావాలను అక్షరరూపంలోకి మార్చి వాటిని ఒక అందమైన పెయింటింగ్‌గా మలచండి. అది కూడా చూడగానే.. ఆ వ్యక్తికి మీ భావాలు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండే విధంగా జాగ్రత్తపడండి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటే ఇదేమీ అంత కష్టమైన పని కాదు.. పైగా అక్షరాలకు బదులుగా ఒక్క ఇమేజ్ పంపించి మీ భావాలను వారికి తెలియజేయచ్చు. ఐడియా బాగుంది కదూ..

7. డిలీట్ చేయండి..

సెక్స్టింగ్ చేయడం పూర్తైన తర్వాత.. ఆ సందేశాలను మీ ఫోన్ నుంచి పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం. సరదాగా ఉందనో లేక ఫ్రీ టైంలో చదువుకుందామనో వాటిని అలాగే వదిలేస్తే ఆ సందేశాలే మిమ్మల్ని ఇరకాటంలో పడేసే అవకాశాలుంటాయి. పిల్లలు, సన్నిహితులు.. ఎవరైనా మీ ఫోన్ చూసినప్పుడు ఈ సందేశాలు వారి కంట పడితే ఇబ్బంది పడేది మీరే అని గుర్తుంచుకోండి. అలాగే సెక్స్ట్‌ని డిలీట్ చేయడమంటే మీరేదో తప్పు చేస్తున్నారని భావించకండి. కేవలం మీ భద్రత కోసమే ఇలా చేయడం మంచిదని భావించండి.

22 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT