ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా  – సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా – సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్లలో డేరింగ్ & డాషింగ్ హీరోయిన్ గా పేరొందింది రోజా. సినిమాల్లో హీరోయిన్ గా నటించే రోజుల నుంచి తల్లి పాత్రలు చేసే ఇప్పటి వరకూ ఆమె ఒకేలా ఉండడం విశేషం. నటిగా.. వ్యాఖ్యాతగా, రాజకీయ నాయకురాలిగా రోజా (roja) లోని వివిధ కోణాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆమె హీరోయిన్ గా మారిన తొలినాళ్ళలోనే ప్రేమలో పడిందట.. ఆపై కొన్నాళ్లకే పెళ్లి చేసుకుందామనే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ పెళ్లికి మాత్రం పదకొండేళ్లు ఆగిందీ జంట. దాని వెనుక ఉన్న కారణాలతో పాటు ఈ జంట ప్రేమ కథ ( love story) ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

రోజా ప్రేమించి & పరిణయమాడిన వ్యక్తి ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణి (selvamani). వీరిద్దరి పరిచయం 1991లో చెన్నైలో ఒక షూటింగ్ సందర్భంగా జరిగింది. వారిరువురు తొలిసారి కలిసిన క్షణాలని ఇప్పటికి కూడా సెల్వమణి గారు గుర్తుచేసుకుంటుంటారు. తొలిసారిగా రోజాని చూసినప్పుడు ఆమె ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించడం జరిగిందట, అయితే ఎరుపు రంగు అంటే సెల్వమణి గారికి చాలా ఇష్టమట. ఒకరకంగా మమ్మల్ని ఎరుపు రంగు కలిపింది అని ఆయన సరదాగా చెబుతుంటారు.

రోజా తనకు పరిచయం కాగానే ఆమె తన సినిమాలో హీరోయిన్ గా సరిపోతుంది అని నిర్ణయించుకుని తాను దర్శకత్వం వహిస్తోన్న చెంబురతి అనే తమిళ సినిమాలో ఆమెకు సెల్వమణి ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ హీరోగా నటించిన ఈ  సినిమా షూటింగ్ జరిగే క్రమంలో రోజా సెల్వమణి ల  మధ్య స్నేహం చిగురించింది. అయితే ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.

ADVERTISEMENT

ఆ తర్వాతే ఈ ప్రేమకథలో తొలి మలుపు వచ్చింది అని చెప్పాలి… అదేంటంటే – రోజాని ఇష్టపడిన సెల్వమణి, ఆ విషయాన్ని ముందుగా రోజాకి కాకూండా ఆమె తల్లిదండ్రులకి చెప్పడం.. రోజాతో పెళ్లి కి వారి అనుమతి కోరడం జరిగింది. ఈ ప్రపోజల్ విన్న రోజా కుటుంబం ఇదే విషయాన్నీ రోజా వద్ద ప్రస్తావించగా ఆమెకి ఇదంతా ఒక షాక్ లా అనిపించిందట. అసలు తనని ప్రేమిస్తున్నాను అని తనకి చెప్పకుండా నేరుగా తన కుటుంబంతో పెళ్లి గురించి మాట్లాడడమేంటి అని అనుకున్నప్పటికి .. అప్పటికే సెల్వమణి అంటే ఉన్న మంచి అభిప్రాయంతో ఆయనతో వివాహానికి అంగీకారాన్ని తెలిపింది.

అయితే ఆ సమయంలో రోజాకి తెలుగులో చేసిన చిత్రాలు విజయవంతం అవ్వడంతో ఆమె హీరోయిన్ గా ఇంకొంత కాలం కొనసాగాలని భావించిందట. అదే విషయాన్నిసెల్వమణికి తెలపగా.. దానికి ఆయన కూడా సరేనన్నారు. అయితే అప్పుడు హీరోయిన్ గా కొద్దీ కాలం కొనసాగి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్న వీరి వివాహం ఏకంగా 11 ఏళ్ళ పాటు వాయిదా పడింది. పదకొండేళ్ల తరువాత అంటే ఆగష్టు 10, 2002లో వీరి పెళ్లి జరిగింది.

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

ఇంత ఆలస్యానికి కారణమేంటి అంటే – తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్ల ని వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. వారిని సెటిల్ చేయడానికి ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో వారికి తోడ్పాటు ఇవ్వాలని అనుకోవడం.. అందులో భాగంగానే సమరం అనే చిత్రాన్ని తెలుగు & తమిళ భాషల్లో తెరకెక్కించడం జరిగింది.

ADVERTISEMENT

ఈ షూటింగ్ మొదలయ్యాక అనేకసార్లు రోజా షూటింగ్ లో గాయపడడం అలాగే అనేక కారణాల వల్ల ఈ చిత్రం తాలూకా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి విడుదలయ్యాక కూడా పరాజయాన్ని మూటగట్టుకుంది. అలా ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు మరికొంత కాలం చిత్రాలు చేయాల్సి వచ్చింది. ఇలా అనేకమైన అనుకోని సంఘటనలు వీరి వివాహాన్ని వాయిదాల పైన వాయిదాలు పడేలా చేశాయి. అలా దాదాపు 11 ఏళ్ళ పాటు వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టేందుకు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే వివాహం చేసుకోవడానికి ఇన్నేళ్ల సమయం పడుతున్నా కూడా వీరిరువురు ఎక్కడ కూడా తమ ప్రేమ బంధంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా చక్కగా ముందుకి సాగారు.

ఇక వీరి ప్రేమ & పెళ్లి బంధానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి కూతురు అన్షు మాలిక & కొడుకు కృష్ణ లోహిత్. వీరిద్దరిలో కొడుకు కృష్ణ లోహిత్భవిష్యత్తులో సినిమా రంగంలోకి అడుగుపెడతాడు అని ఇప్పటికే ఈ నటి – దర్శకుడు జంట ప్రకటించేసింది.

ప్రేమ నుండి పెళ్లి వరకు ఉండే సమయంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే.. ఎటువంటి భేదాభిప్రాయాలకి తావు ఇవ్వకుండా ముందుకి సాగడానికి రోజా – సెల్వమణి ల ప్రేమకథనే (love story) ఆదర్శం అని చెప్పకతప్పదు.

మాది 100 % ‘లవ్ స్టోరీ’ – సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

ADVERTISEMENT
21 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT