దసరా (Dussehra).. దేశమంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దసరా సరదా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దసరా ఎప్పుడొస్తుందా? అని సంవత్సరమంతా వేచి చూసే వాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే.. దసరా అనేది పండుగల సీజన్‌కి ఆరంభం. బతుకమ్మ, దీపావళి లాంటి పండుగలతో పాటు.. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటివి కూడా.. దసరా వేడుకలకు చాలా దగ్గర్లోనే ఉంటాయి.
దసరా పండుగను ఆనందోత్సాహాలతో పాటు.. సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకునేవారిలో మీరూ ఒకరా? అయితే ఈ దసరా పండగను సంప్రదాయబద్ధంగానే నూతన దుస్తులతో.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ జరుపుకోండి. అందుకోసం.. మేం ప్రత్యేకంగా ఎంపిక చేసిన.. ఈ అవుట్ ఫిట్స్‌ను (Outfits) ఓసారి చూసేయండి.
1. చీరలో సంప్రదాయబద్ధంగా..
పండగ రోజు వేసుకునే అవుట్ ఫిట్స్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది చీర గురించే. సాధారణంగా పండగ వేళ.. పట్టు లేదా జరీతో ఉన్న చీరలు కట్టుకొని సంప్రదాయబద్ధంగా సిద్ధమవుతుంటారు అమ్మాయిలు. కానీ ప్రత్యేకంగా కనిపించాలంటే కేవలం పట్టు చీరే కట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలనుకుంటే కేవలం బోర్డర్ మాత్రమే కనబడే.. ఎంబ్రాయిడరీ చీరలు కూడా కట్టుకోవచ్చు.
కాస్త తెల్లగా ఉండేవారు.. ముదురు రంగులో ఉండే చీరలు కట్టుకోవచ్చు. చామన ఛాయ రంగు కలవారు.. లేత రంగులున్న షీర్ శారీలను ఎంచుకుంటే అందంగా ఉంటుంది. వీటి మీదకు నప్పేలా సిల్వర్ లేదా గోల్డ్ రంగుల రెడీమేడ్ బ్లౌజ్ ఎంచుకోవచ్చు.
చీరలు కట్టుకోవడం ఇష్టం లేనివారు సంప్రదాయబద్ధంగా మెరిసేందుకు.. లంగాఓణీలను ఎంచుకోవడం సహజం. అందులోనే కాస్త ప్రత్యేకంగా కనిపించే ఎంబ్రాయిడరీ ఉన్న లంగా ఓణీలతో పాటు.. ఇప్పుడు కొత్తగా వస్తున్న స్లీవ్స్, బ్యాక్ నెక్ డిజైన్స్ వంటి వాటిని ఎంచుకోవడం వల్ల మీ లుక్ ట్రెండీగా ఉంటుంది. సింపుల్‌గా కనిపించాలనుకుంటే పొడవాటి ఇయర్ రింగ్స్, గాజులతో మీ లుక్‌ని పూర్తి చేయవచ్చు. కాస్త హెవీగా సిద్ధమవ్వాలంటే మాత్రం.. మెడలో ఓ సన్నని నెక్లెస్ కూడా వేసుకోవాలి.
పండగ ఫ్యాషన్లలో ఎక్కువ మంది ఎంచుకునేది అనార్కలీ. కానీ చుడీదార్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక గత కొన్నేళ్ల నుంచి అనార్కలీ ఫ్యాషనబుల్‌గా మారిపోయింది. అయితే ఇందులో మీ శరీర తత్వాన్ని బట్టి కాటన్, పట్టు, శాటిన్ వంటి రకాలను ఎంచుకోవచ్చు. కాస్త హెవీగా కనిపించాలనుకుంటే.. ఎంబ్రాయిడరీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే ప్లెయిన్‌గా కనిపిస్తూ.. కొత్తగా మార్కెట్లోకి వచ్చే స్లీవ్స్ టైప్‌లో ఏదో ఒకటి ఎంచుకొని.. డ్రస్ మీ శరీరానికి తగినట్లుగా ఫిటింగ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది.
లెహెంగా ఇప్పుడు ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ టాప్ ఫ్యాషనబుల్ దుస్తుల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు చాలామంది ఎంగేజ్ మెంట్, సంగీత్ వంటి ఫంక్షన్లతో పాటు.. వివిధ పార్టీలకు కూడా దీన్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పండగల్లో కూడా లెహెంగా స్టైల్ కొత్తగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మామూలుగా కాకుండా లెహెంగా ఓణీని ప్రత్యేకంగా.. కొత్తగా వేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల.. కొత్త లుక్ మీ సొంతమవుతుంది.
షరారా అనేది ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్. చాలా మంది దీన్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీన్ని ధరించినప్పుడు కుర్తా వేసుకునే విధానాన్ని బట్టి.. దాని లుక్ ఆధారపడి ఉంటుంది. షార్ట్ కుర్తా వేసుకుంటే.. షరారా అందంగా, అద్బుతమైన రంగులో ఉండేలా చూసుకోవాలి. కాస్త లాంగ్ కుర్తా వేసుకోవాలనుకుంటే.. కుర్తాకి మ్యాచింగ్‌గా ఉండేలా చూసుకోవాలి. స్పెషల్ లుక్ కావాలంటే.. కాస్త హెవీ జ్యుయలరీ.. లేదంటే సింపుల్‌గా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది.
చుడీదార్ వేసుకోవడం ఎప్పుడూ కామన్. కానీ చుడీదార్‌తో పాటు లాంగ్ జాకెట్ వేసుకోవడం వల్ల.. మీ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జాకెట్ డ్రస్‌కి వ్యతిరేక రంగులో ఉన్నా లేక దానికి మ్యాచింగ్‌గా ఉన్నా.. అందంగా కనిపిస్తుంది. దీనితో పాటు అందంగా కనిపించేందుకు.. ఓ చక్కటి నెక్లెస్ లేదా హారం వేసుకోవాలి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.