ADVERTISEMENT
home / Fiction
దుర్గాదేవిని 108 నీలి కమలాలతో పూజిస్తే.. శుభం జరుగుతుందట – ఎందుకో తెలుసా ?

దుర్గాదేవిని 108 నీలి కమలాలతో పూజిస్తే.. శుభం జరుగుతుందట – ఎందుకో తెలుసా ?

(Significance of 108 Lotus flowers on the occasion of Durga Puja)

విజయదశమి పర్వదినాలలో భాగంగా.. దుర్గాదేవిని శక్తి దేవతగా పూజించడం ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయతీగా వస్తోంది. భారతదేశంలో హిందువులు జరుపుకొనే అతి పవిత్రమైన పండగలలో.. దుర్గాపూజ కూడా ఒకటి. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. ఈ రోజున 108 నీలి కమలాలతో అమ్మవారిని పూజిస్తే.. కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయట. వేద గణితం ప్రకారం ఈ 108 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యునికి,  భూమండలానికి మధ్యనున్న సగటు దూరం.. వాటి చుట్టుకొలతతో పోలిస్తే 108 సార్లు ఎక్కువట. 

తెలంగాణ సంప్రదాయకతకు అద్దం పట్టిన.. బతుకమ్మ సంబురాలు ..!

అలాగే మన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108 మాత్రమే. ఇక శ్రీరాముడు కూడా రావణుడిని వధించడానికి వెళ్లినప్పుడు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 108 దీపాలు వెలిగించి.. 108 నీలి కమలాలను అమ్మవారికి సమర్పించాడట. ఆ తర్వాత ఆ దేవదేవి దీవనెల వల్లే తనను విజయలక్ష్మి వరించిందట. ఈ సంప్రదాయం యుగాల నుండి ఉన్నా.. 16వ శతాబ్దంలో ఎక్కువగా ఆచరణలోకి వచ్చింది. చక్రవర్తులు, జమీందారులు.. శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకోవడానికి నీలి కమలాలను సమర్పించేవారట.

ADVERTISEMENT

అమ్మవారికి ఏ రోజున.. ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

ఇక ఈ పూజలో భాగంగా కమల పుష్పాలతోనే.. ఆ దేవదేవికి అర్చన చేయడానికీ ఓ కారణముందట. కమలం సౌందర్యానికి, ఒకరి మీద ఆధారపడకుండా జీవించే తత్వానికి ప్రతీక. మట్టిలో నుండి పుట్టే ఈ పుష్పం.. తనను తానే ఏ ఆధారం లేకుండా శుద్దిపరచుకొని వికసిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. స్వశక్తికి  ఇది ప్రతీక. శ్రమకు చిహ్నం. ఎన్ని పుజలు చేసినా.. ఆ దేవదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా.. లక్ష్యం మీద గౌరవం, నమ్మకం.. అందుకు అనుగుణంగా కష్టపడే తత్వం లేకపోతే ఫలితం శూన్యమనే సందేశాన్ని మనకు కమలం అందిస్తుంది. 

 

ADVERTISEMENT

Wikemedia Commons

బౌద్ధ మత గ్రంథాలలో కూడా నీలి కమలాల ప్రస్తావన ఉంది. అవి జ్ఞానానికి ప్రతీకలు. ఈ కమలాలను విజయదశమిని పురస్కరించుకొని.. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల నుండి కూడా రప్పిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే అమ్మవారి ఉత్సవాలలో కూడా.. ఈ కమలాలు ఆర్చనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కమలాలతో ఆ దేవదేవికి అర్చన చేయడానికి.. భక్తులు పోటీపడుతుంటారు. కొన్ని దుర్గాదేవి ఆలయాలలో కమలార్చన సందర్భంగా ప్రత్యేక దర్శనాలు కూడా జరుగుతుంటాయి. 

సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

కొన్ని ప్రాంతాలలో దేవీనవ రాత్రుల సందర్భంగా.. సాముహిక కమలార్చన సేవలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక పెనుగొండ వాసవి క్షేత్రంలో కేరళ వాయిద్యాలతో ఆ దేవిదేవిని స్తుతిస్తూ.. విశేష పంచ హారతి, సహస్ర కమలార్చన, లక్ష మల్లెల పూజ, అభిషేకం, పవళింపు సేవ లాంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. అష్టలక్ష్మీ ఆలయాలలో కూడా.. ఈ దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా.. కమలార్చనను ప్రత్యేకంగా జరపడం విశేషం. 

ADVERTISEMENT

Featured Image : Shutterstock.com

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                                                                               

06 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT