16 నవంబరు 2019 (శనివారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

16 నవంబరు 2019 (శనివారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (16 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు మీ పని స్థిరంగా సాగుతుంది. అలాగే పలువురికి మార్గదర్శకత్వం కూడా చేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు లేదా ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. ఆలుమగల అనుబంధాలు మరింత పటిష్టం అవుతాయి. ఉద్యోగస్తులు 
ఎక్కువ  గంటలు పనిచేయాల్సి రావచ్చు. అలాగే మీరు భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇదే సరైన సమయం. కాకపోతే ఎంత బిజీగా ఉన్నా... మీ ప్రియమైనవారి కోసం సమయం కేటాయించండి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీరు మీ మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  అయితే మీకు సంబంధంలేని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.  అదే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకొనేటప్పుడు.. మీకు ఎదురైన గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో మీరు కొంత నిరాశకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
కుటుంబ సభ్యులు ఒకానొక సందర్భంలో.. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు సహోద్యోగులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. అలాగే మీ ఉద్దేశాలకు విలువివ్వని వారికి దూరంగా ఉండండి. ఏదో అభద్రతాభావం మిమ్మల్ని వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు తాము ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీ కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా సాగుతుంది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు కొన్ని విషయాలలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. అలాగే కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓ ప్రత్యేకమైన విందుకు మీకు ఆహ్వానం అందుతుంది.  అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలలో మీరు సౌమ్యంగా వ్యవహరించడం మేలు. ఎదుటి వారు చెప్పే మాటలను కూడా అప్పడప్పుడు ఓపికగా వినడానికి ప్రయత్నించండి.

సింహ రాశి (Leo) – ఈ రోజు మీ పని అస్తవ్యస్తంగా సాగుతుంది. మీరు చాలా వేగంగా పనిని పూర్తి చేయాలని భావించినా.. ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అయినా మీ సామర్థ్యం మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. అలాగే ఎలాంటి తప్పు జరిగినా ఇతరులను విమర్శించవద్దు. ఓపికగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మేలు. అయితే పని ఒత్తిడిలో పడి.. సమయానికి నిద్రపోవడం మరిచిపోవద్దు. అలాగే మీ చిరాకును మీ భాగస్వామి మీద చూపించకుండా.. తన పట్ల ప్రేమగా వ్యవహరించండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు మీ పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ టీమ్ వర్క్ మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. అయినా కొన్నిసార్లు మీరు ఏదో తెలియని అయోమయానికి గురవుతుంటూ ఉంటారు. అయితే చాలా తక్కువ సమయంలోనే మీ సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి.  అలాగే మీ ఆఫీసు సమస్యలను కుటుంబ సభ్యుల వద్ద ఏకరువు పెట్టవద్దు. మీ సన్నిహితులతో, ప్రియమైన వ్యక్తులతో చాలా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో.. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అలాగే పనులన్నీ మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు. మీరు కొత్త ఉపాధి అవకాశాలను వెతికే పనిలో పడే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అయితే ఇదే క్రమంలో కెరీర్‌కు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అలాగే  మీ ఎదుగుదలకు  కొత్త మార్గాలను అన్వేషిస్తారు.  మీ చిరకాల కలలు నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీకు మీ భాగస్వామి మద్దతు కూడా ఉంటుంది.  మీరు ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా చాలా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రత్యర్థులను కొన్ని విషయాలలో క్షమించి వదిలేయడం మేలు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు పని విషయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే  మీ భవిష్యత్తు పై మీకంటూ ఒక స్పష్టత వస్తుంది. అలాగే కుటుంబానికి సంబంధించి కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆస్తి తగాదాలు లేదా కోర్టు లావాదేవీలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని భేటీలు, సంప్రదింపులు జరుగుతాయి. లీగల్ విషయాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. 

మకర రాశి (Capricorn) – ఈ రోజు మీ మనసులోని మాటను.. మీరు ప్రేమించే వ్యక్తికి చెప్పడం మేలు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు .. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగ జీవితంలో బాస్ / క్లయింట్లు లేదా సహోద్యోగులు మీ నుండి చాలా ఎక్కువ ఆశించే అవకాశం ఉంది.   అయితే మీ గమ్యంపైనే మీ దృష్టిని ఉంచండి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - మీ జీవితానికి సంబంధించి మీరు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు అనువైనది.  నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళితే.. కచ్చితంగా విజయం సాధిస్తారు.  అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 

మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ఎవరినైనా విశ్వసించే ముందు నూటికి పదిసార్లు ఆలోచించండి.  అలాగే వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వండి.  మీ అనారోగ్యం మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు. అందుకే అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపి.. ఆ విధంగా సేదతీరడానికి ప్రయత్నించండి.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.