17 నవంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

17 నవంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (17 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మనో ధైర్యాన్ని పెంచుకొని ముందుకు వెళ్లండి. అలాగే కొన్ని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుండి మీరు అనుకోని ప్రతిపాదనలు వస్తాయి. అలాగే మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. తన అభిప్రాయాలకు కూడా విలువివ్వండి. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది.

వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీరు  తీవ్రమైన పోటీ వాతావరణాన్ని తట్టుకుంటారు. అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా క్రమబద్ధంగా ముందుకు సాగుతాయి. కొన్ని సార్లు మీకు అలిసిపోయిన భావన కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా ఒత్తిడి ఉంటుంది. అపరిచితులతో ఘర్షణకు దిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు చాలా నిదానంగా గడుస్తుంది. కొందరు మీ కుటుంబంలో కలతలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని అనివార్య పరిస్థితులలో మీరు దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎంత ఒత్తిడిలో ఉన్నా.. మీ మనో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి.  

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు పనులన్నీ చాలా వేగంగా చేస్తారు. అలాగే  శారీరకంగా కూడా అలసిపోతారు.  మీ బాల్య మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంది.  మీ భాగస్వామి పట్ల కూడా ఎంతో ప్రేమగా మెలగడానికి ప్రయత్నించండి. మీ చిరకాల కోరిక ఒకటి ఈ రోజు తీరబోతోంది. అలాగే వ్యక్తిగత విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవడం మంచిది.  

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు స్థిరంగా పనిచేస్తారు. అలాగే చాలా చురుగ్గా కూడా ఉంటారు. కొన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి మీకు మీ స్నేహితులు సహాయం చేస్తారు. అలాగే మీ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు.. మీకు బాగా సన్నిహితులైన వ్యక్తులను కూడా వెంట తీసుకెళ్లండి.  

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు చాలా భావోద్వేగానికి గురయ్యే పరిస్థితులు సంభవించవచ్చు. అవి మీ వ్యక్తిగత జీవితంపై కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. మీ సమస్యలను మీ సన్నిహితులతో కూడా చర్చించండి. కుటుంబ సభ్యులతో కూడా సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి.  అలాగే కొన్ని ముఖ్యమైన విందు, వినోద కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం ఉంది. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు పని ఒత్తిడి కారణంగా కాస్త అసహనంతో ఉంటారు. అయితే ఆ ప్రభావం మీ కుటుంబంపై పడకుండా చూసుకోండి. మీ భార్య, బిడ్డలతో ఆనందంగా, ప్రేమగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే రుణాలు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.  అలాగే మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి బాగా పెరుగుతుంది. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే కుటుంబంలో కూడా చాలా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో మంచి విషయాలు వింటారు. ఉద్యోగస్తులు కూడా ఆఫీసు పనులలో చాలా బిజీగా ఉంటారు. అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. పాత స్నేహితులతో కలిసి హాయిగా గడిపే అవకాశం కూడా ఉంది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని సంఘటనలు జరగవచ్చు. అయితే అవి జీవితంపై ఎలాంటి ప్రభావమూ చూపించవు. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే శక్తివంచన లేకుండా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆస్తి లావాదేవీలు, కోర్టు కేసులు మొదలైనవన్నీ ఒక కొలిక్కి వస్తాయి.  

మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు సోమరితనాన్ని వీడి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ కనబరచాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో అనవసరమైన ఘర్షణలకు దిగకపోవడం శ్రేయస్కారం. అలాగే మీ టెన్షన్ల ప్రభావం మీ ఆరోగ్యం మీద పడకుండా జాగ్రత్త పడండి.  మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తాయి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీరు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే మీ కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. మీ ప్రియమైన వారితో కలిసి.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది.  ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఆలుమగలు తొలుత పొరపొచ్చాలు వచ్చినా.. తర్వాత రాజీ పడతారు. 

మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ప్రతీ పనిని ఓ ప్రణాళిక ప్రకారం చేయడం మంచిది. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీ పెండింగ్ పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపుతడతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.