ఈ రోజు (18 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు మీరు ఒక సమయంలో కేవలం.. ఒక విషయంపైనే దృష్టి పెట్టాలి. అలాగే కాస్త బిజీగా ఉన్నా… కొన్ని నిర్ణయాలు టీమ్‌తో కలిసి తీసుకోవాలి. అలాగే మీరు ఈ రోజు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే మీ కుటుంబం నుండి అనుకోని ఒత్తిళ్లు మొదలవుతాయి. నిరుద్యోగులు నిరాశను వీడి .. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం శ్రేయస్కరం.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. అయినా సరే మీకు ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగని మీరు చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలలో కోపం తగ్గించుకోవడం మంచిది. అలాగే మీకు ఆఫీసులో అదనపు బాధ్యతలు లభించే అవకాశముంది. అలాగే సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు.
మిథున రాశి (Gemini) – ఈ రోజు మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. అలాగే కొందరి ప్రవర్తన మీకు అసహనాన్ని కలిగించవచ్చు. అయినా సరే.. మనో ధైర్యంతో ముందుకు వెళ్లండి. మీ ప్రణాళిక ప్రకారం.. మీరు పనులు చేసుకుంటూ వెళ్లడానికి ఇదే సరైన సమయం. అలాగే మీ కుటుంబానికి వీలైనంత ఎక్కువగా సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. వారితో సరదాగా గడపండి.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు చేస్తున్న రెండు పనుల మధ్య సమతుల్యత పాటించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు అపరిచితుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రేమికులు ఒక నిర్ణయం తీసుకొనేటప్పడు.. ఎదుటి వారి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని ఈరోజు కలిసే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు చేస్తున్న పనులు కొన్ని అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో మీ బాధ్యతలను ఇతరులతో పంచుకోండి. అలాగే కొన్ని విషయాలలో దూకుడును తగ్గించండి. ఇతరుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా తీసుకోండి. అలాగే మీ భాగస్వామి కోసం సమయం కేటాయించడం మర్చిపోవద్దు.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవకాశాలు తలుపు తడతాయి. అదేవిధంగా మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని సంఘటనలు జరగవచ్చు. కొన్ని విషయాలలో మీరు వివేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ భాగస్వామి నుండి మీరో శుభవార్త వింటారు.
తుల రాశి (Libra) – ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ పనులన్నీ కూడా చాలా నిదానంగా సాగుతాయి. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల పై కూడా మీరు ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. కొన్ని అనుకోని సమస్యలకు.. మీ కుటుంబ జీవితం కేంద్ర బిందువుగా మారుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని గందరగోళంలోకి నెడతాయి.
వృశ్చిక రాశి (Scorpio) – మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఈ రోజు మీ జీవితం పై ఉంటుంది. అలాగే కొందరు కావాలనే మీ పై నిందలు వేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు చేస్తున్న పనులపై మీకుంటూ ఒక స్పష్టత ఉండడం అనేది చాలా అవసరం. కొన్ని కుటుంబ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీ సన్నిహితుల సహాయంతోనే పరిష్కరించుకోవడం శ్రేయస్కరం
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ఈ రోజు అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. వ్యవస్థీకృత లోపాల పట్ల మీరు తీవ్రమైన బాధను వ్యక్తపరుస్తారు. అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. మీ కుటుంబంలో కొన్ని పొరపొచ్చాలు వచ్చినా.. తర్వాత ఆ సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి.
మకర రాశి (Capricorn) – ఈ రోజు మీ పని స్థిరంగా సాగుతుంది. అయితే మీ సన్నిహితులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల.. మీరు అసహనానికి గురవుతారు. ఇలాంటప్పుడే కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఎవరినీ నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఘర్షణను నివారించండి. కొన్ని సందర్భాలలో గత విషయాలను ప్రస్తావనకు తేవకపోవడం మంచిది.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో నియంత్రణను పాటించాలి. ముఖ్యంగా కోపానికి దూరంగా ఉండాలి. మీ వైఖరి కొందరికి ఇబ్బందిని కలిగించవచ్చు. అలాగే కొన్ని విమర్శలను స్వీకరించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా.. అంతకంటే ముఖ్యమైన పనుల గురించి ఆలోచించండి.
మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు అనుకోని చిక్కులలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని విషయాలలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి. రుణాలు ఇచ్చేటప్పడు లేదా తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ భావోద్వేగాలను కొన్ని సార్లు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.