19 నవంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

19 నవంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (19 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీ పని స్థిరంగా సాగుతుంది. కానీ కొంత ఒత్తిడికి గురవుతారు. మీ సహోద్యోగుల నుండి మీకు సహాయం కచ్చితంగా లభిస్తుంది. కొత్త కెరీర్‌ను ప్రారంభించడానికి.. మీరు ఆసక్తిని చూపించే అవకాశం కూడా ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించండి. మీ భాగస్వామితో ఘర్షణ పడినంత మాత్రాన.. సమస్యలు దూరమవుతాయన్న ఆలోచనను వీడండి.  

వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీరు కార్యదీక్షతో పనిచేస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా సరే..  మీదైన శైలిలో  వివేకాన్ని ప్రదర్శిస్తారు. అలాగే.. మీ పనులను పూర్తి చేయడానికి కావాల్సిన గడువును అధికారుల నుండి పొందుతారు. అయితే భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వివాదాస్పద విషయాలలో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీ పనులు సానుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఉపాధి అవకాశాలను పొందడం కష్టమేమీ కాదు. ఇక ఉద్యోగస్తులు ఆఫీసులో కొన్నిసార్లు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రేమికులు కొన్ని నిర్ణయాలను తీసుకొనేటప్పుడు.. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం మంచిది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు ఆర్థికంగా అస్థిరతను ఎదుర్కొంటారు. మీ క్లయింట్ల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.  కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ సన్నిహితుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. అలాగే మీ భాగస్వామితో కూడా నిజాయతీగా వ్యవహరించండి. 

సింహ రాశి (Leo) – ఈ రోజు మీ పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చలు, సమావేశాలు జరుగుతాయి. పలువురు మిమ్మల్ని విమర్శించే అవకాశం కూడా ఉంది.  అయినా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ నిజాయతీయే మీకు శ్రీరామరక్ష. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ  రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. ఆఫీసులో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు తమ కెరీర్ విషయంలో  స్పష్టతను కలిగి ఉండడం ఎంతైనా అవసరం. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని స్థిరంగా సాగుతుంది. మీ టీమ్‌లోకి కొత్త సభ్యులు చేరుతారు. విద్యార్థులు కొత్త కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయినా సరే భయపడవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ భావోద్వేగాలను పరీక్షించే సంఘటనలు కూడా జరుగుతాయి.  

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీ పని చాలా నిదానంగా సాగుతుంది.  అదేవిధంగా సృజనాత్మకతమైన ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టార్టప్స్ లేదా కొత్త వ్యాపారాలు చేసే యువతకు అంతా సానుకూలంగా ఉంటుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో.. ఒకరికొకరు బాసటగా నిలవడం మంచిది. ఆలుమగలు తొలుత పొరపొచ్చాలు వచ్చినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మీ పని సానుకూలంగా సాగుతుంది. అలాగే ఆర్డర్లు, చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  కుటుంబంలో ఒకానొక విషయానికి సంబంధించి గంభీర వాతావరణం నెలకొంటుంది. అలాగే ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసులు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ వాతావరణాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. 

మకర రాశి (Capricorn) – ఈ రోజు మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అలాగే స్నేహితులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు తొలిగిపోతాయి. మిమ్మల్ని అసహనానికి గురి చేసే సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి సందర్భంలోనే వివేకంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించండి.  అప్పడప్పుడు మీరు చేస్తున్న పనులను కూడా సమీక్షించుకోవడం ప్రారంభించండి.  

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. అలాగే మీ పనులన్నీ ఫలప్రదంగా సాగుతాయి. మీ కుటుంబ జీవితం కూడా సానుకూలంగా ఉంటుంది. పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి కొన్ని మంచి విషయాలు వింటారు. ప్రేమికుల సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడే సూచనలు కనిపిస్తున్నాయి.  

మీన రాశి (Pisces) – ఈ రోజు మీ పనులన్నీ స్థిరంగా సాగుతాయి. కానీ వ్యక్తిగత సమస్యల కారణంగా.. కొంత చికాకు మిమ్మల్ని ఆవరించవచ్చు. అలాగే మీ భాగస్వామితో సాధ్యమైనంత వరకూ.. సౌమ్యంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. అనవసర విషయాలకు సంబంధించి గొడవలు పడడం వల్ల.. సంసార జీవితం ప్రభావితం అవుతుందన్న సత్యాన్ని నమ్మండి.  అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.