20 నవంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

20 నవంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (20 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు కొన్ని చిత్రమైన అనుభవాలను పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే భవిష్యత్ కోసం ప్రణాళికలు రచిస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులు శుభవార్తలు వింటారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. కచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. 

వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీరు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. అలాగే మీ శ్రమకు తగిన ఫలితం కూడా దక్కుతుంది. కొత్త వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు కూడా జరుగుతాయి.  మీ కుటుంబం నుండి కూడా మీకు ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు కమ్యూనికేషన్ గ్యాప్  వల్ల అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయంలో స్పష్టత లేకపోతే.. దాని గురించి ఆలోచించకపోవడం మంచిది. అంతే కాని.. రిస్క్ తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకే ప్రమాదం. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించండి. మీ భాగస్వామి కోసం కూడా సమయం కేటాయించండి.  

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. అయినా సరే.. వివేకంతో, సమయస్ఫూర్తితో అటువంటి చిక్కుల నుండి బయటపడతారు. అయితే ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో ఒత్తిడికి గురవుతారు. మీ కుటుంబ జీవితంలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి సమయంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. 

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు అనుకోని శుభవార్తలు వింటారు. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. వాటిని ఇతరులతో పంచుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. అయితే తెలియని రంగాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు... నిపుణులు లేదా సన్నిహితుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు చేసే పనులకు సానుకూల ఫలితాలు పొందుతారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సృజనాత్మకమైన ఆలోచనలకు పెద్ద పీట వేస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులు.. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు తమ ప్రతిభను చాటేందుకు ఇదే మంచి అవకాశం. మీకిష్టమైన రంగాలలో ప్రయత్నించండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పనులన్నీ స్థిరంగా సాగుతాయి. అలాగే సృజనాత్మక ఆలోచనలకు పెద్ద పీట వేస్తారు. కొత్త ప్రణాళికలు కూడా రచిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. అలాగే తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మనో నిగ్రహాన్ని పాటించండి. అలాగే సాధ్యమైనంత వరకూ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.  

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే ఇంటికి అనుకోని అతిథులు వస్తారు.  కొన్ని సందర్భాలలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలను దాపరికం లేకుండా మీ భాగస్వామితో పంచుకోవడం మీకే శ్రేయస్కరం. తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.  అలాగే మీ పిల్లల తీరుతెన్నులను గమనిస్తూ ఉండండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) -  ఈ రోజు మీరు పని విషయంలో కీలక మార్పులు చేసుకుంటారు. ఆఫీసులో కూడా చాలా సరదా వాతావరణం ఉంటుంది. అధికారులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు.  అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ రోజు లాభాలను చవిచూస్తారు. కొన్ని సందర్భాలలో మీరు బద్ధకాన్ని వీడాల్సి ఉంటుంది. 

మకర రాశి (Capricorn) –   ఈ రోజు మీరు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దీనికి ఒక ప్రణాళిక అనేది అవసరమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్నిసార్లు తెలియని పనులను రిస్క్ తీసుకొని చేసుకొనే బదులు.. సీనియర్ల సూచనలు తీసుకోవడం మంచిది. అలాగే ఆఫీసు పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా.. ఇంటికి వెళ్లాక కుటుంబంతో సరదాగా గడపడానికే ప్రయత్నించండి.  

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీకు కొత్త ప్రాజెక్టుల విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది. అలాగే ఆఫీసులో వాతావరణం కూడా పూర్తిగా కొత్తగా ఉంటుంది. వివాహితులు అనుకోని ఇబ్బందులలో చిక్కుకుంటారు.  ఇలాంటి సందర్భాలలోనే మీరు తెలివిగా వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. అందుకు వీలైతే మీ సన్నిహితుల సహాయాన్ని కూడా తీసుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు బద్ధకాన్ని వీడి.. మీరు చేస్తున్న పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయాలలో మీ శ్రమ, నిజాయతీ మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఆలుమగలు కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.  అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.