28 నవంబరు 2019 (గురువారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

28 నవంబరు 2019 (గురువారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (28 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు అవివాహితులకు శుభదినం. కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహితులకు తమ భాగస్వామితో బంధాలు పటిష్టమవుతాయి.  వ్యాపారస్తులకు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  అవగాహన లేని రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి కూడా సమయం కేటాయించండి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ రాశి వారి సులభ ధనయోగం కూడా ఉంది. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు తమ జీవిత భాగస్వామితో పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాలలో మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. ఆఫీసులో సీనియర్‌లతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆకర్షితులవుతారు. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకపోవడం బెటర్. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్థిరాస్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి వివాహాది వేడుకలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఒంటరితనాన్ని ఫీలవుతారు. అలాగే తమ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొత్తగా ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. అనుకోని అనర్థాలు తలెత్తవచ్చు. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మిమ్మల్ని అనుకోని అదృష్టం వరిస్తుంది. అలాగే జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సీనియర్‌లతో విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం శ్రేయస్కరం కాదు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడినా.. పనులు ముందుకు సాగవు. ఇలాంటప్పుడూ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో, వివేకంతో వ్యవహరించాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు షాపింగ్ చేసేటప్పుడు లేదా బ్యాంకుకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.