29 నవంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

29 నవంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (29 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే కుటుంబ వివాదాలు సమసిపోతాయి. సామాజిక కార్యక్రమాలలో కూడా మీ భాగస్వామ్యం పెరుగుతుంది. ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు.

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభదినం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక వాణిజ్య రంగంలోని వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు పూర్తవుతాయి. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఆలుమగల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు అవివాహితులకు శుభదినం. కళ్యాణ ఘడియలు దగ్గరపడే అవకాశం ఉంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఇంకొంచెం శ్రమించాలి. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. 

సింహ రాశి (Leo) –   ఈ రోజు మీరు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి.  వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫీసులో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం మంచిది. కొన్ని విషయాలలో మీ జీవిత భాగస్వామితో అభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాగే కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. విలువైన బహుమతులు లేదా ఆఫర్లను స్వీకరిస్తారు. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. ఆలుమగలకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంటుంది.  నిరుద్యోగులు కూడా మంచి ఉపాధి అవకాశాలను పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ వ్యాపారంపై మీ ప్రత్యర్థుల ప్రభావం పడుతుంది.  అయినా సరే మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మీకు ఆఫీసులో ఒత్తిడి ఉంటుంది. సీనియర్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయినా సరే.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మీ నిజాయతీయే మీకు శ్రీరామరక్ష. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారస్తులకు వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఖర్చులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ ఇత్యాది రంగాలలో పెట్టుబడులు పెడతారు.  వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధపడండి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శారీరక శ్రమతో కొంత ఒత్తిడికి గురవుతారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాలి. వ్యాపారస్తులు  ఆదాయ, వ్యయాలను నియంత్రించుకోవాలి. ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్ని విషయాలు మిమ్మల్ని అసహనానికి, ఆందోళనకు గురిచేయవచ్చు. ఇలాంటి సమయాలలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే మంచిది. అదేవిధంగా వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.