ఈ రోజు (30 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు మీరు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీ భాగస్వామ్యం పెరుగుతుంది. నిరుద్యోగుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు
వృషభ రాశి (Tarus) – ఈ రోజు నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మహిళలు స్వయంఉపాధి రంగంలో పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడం మంచిది.
మిథున రాశి (Gemini) – ఈ రోజు ఆలుమగలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్త వ్యవహరించండి. అలాగే ఈ రాశి వారికి సులభ ధన యోగం ఉంది. విద్యార్థులు ఇంకొంచెం శ్రమించాలి. ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఆడిట్ జరిగే అవకాశం ఉంది. కనుక అప్రమత్తంగా పనిచేయాలి. ప్రత్యర్థులు వేసే ఎత్తులను దీటుగా ఎదుర్కోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.
సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే వివాదాల జోలికి వెళ్లకపోవడం బెటర్. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. ప్రేమికులు ఒకరిపట్ల మరొకరు గౌరవంగా మెలగాలి.
కన్య రాశి (Virgo) – ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరగవచ్చు. మీ జీవిత భాగస్వామితో తొలుత అభిప్రాయ భేదాలు తలెత్తినా.. త్వరలోనే అవి సమసిపోతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
తుల రాశి (Libra) – ఈ రోజు మీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలవుతాయి. ఆలుమగలు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులు ఇంకొంచెం కష్టపడాలి.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు మీ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ వ్యాపారం కొన్ని ఒడిదొడుకులకు లోనవుతుంది. అయినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. కొన్ని విషయాలలో వివేకంతో ఆలోచించండి.
ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్లండి. నిజాయతీగా ఉండడానికి ప్రయత్నించండి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
మకర రాశి (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నమ్మండి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత అయోమయానికి గురవుతారు. ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి
మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదో తెలియని ఆందోళనకు గురవుతారు. కొన్ని విషయాలు మిమ్మల్ని అసహనానికి గురిచేస్తాయి. ఇలాంటి సమయాలలోనే ఓపికగా వ్యవహరించండి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.