ప్రియా.. నువ్వే నా జీవితానికి వెలుగు : మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్‌'కి ప్రేమలేఖ

ప్రియా.. నువ్వే నా జీవితానికి వెలుగు : మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్‌'కి ప్రేమలేఖ

(Boyfriend Rohman Shawl writes a suprising Love Letter to Sushmita Sen)

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కి కూడా బాగా సుపరిచితురాలే. రక్షకుడు చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈ అందాల తార.. మై హూ నా, చింగారీ, జోర్, సిర్ఫ్ తుమ్, ఆంఖే లాంటి సినిమాలలో తన నటనతో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. పెళ్లి కాకుండానే.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సుస్మిత ఎప్పుడూ వార్తలలోని వ్యక్తే. మన హైదరాబాద్‌లోనే బెంగాలీ తల్లిదండ్రులకు పుట్టిన సుస్మిత.. ప్రస్తుతం రొహ్మన్ షాల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. బాలీవుడ్‌లోనే హాటెస్ట్ కపుల్‌గా వీరిద్దరూ ఇప్పటికే పేరుగాంచారు. 

ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

ఈ రోజు సుస్మితా సేన్ తన 44 వ జన్మదినాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు ఆమె కోసం ఓ వినూత్నమైన ప్రేమ సందేశాన్ని పంపించారు. ఎంతో కవితాత్మకంగా ఉన్న ఆ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఆ సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తే.. నువ్వు నా జీవితానికే వెలుగునిచ్చావు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని నీ కోసం ప్రత్యేకంగా ఏదైనా రాయలనుకున్నాను. కానీ నీ ఆలోచనలతో.. నేను ఆ మాటలనే మర్చిపోయాను. ఓ సౌందర్య రాశీ.. నేను జీవితంలో ఎదిగేందుకు నువ్వు ఎంతగానో తోడ్పడ్డావు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై జాన్" అని తన ప్రేయసిని పొగుడుతూ రొహ్మన్ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. 

నా పాప రాసింది చదివి.. కన్నీళ్లు పెట్టుకున్నాను : సుస్మితా సేన్

రొహ్మన్ ఓ మోడల్. ఓ ఫ్యాషన్ షోలో తనను సుస్మితా సేన్ కలిశారట. తొలుత స్నేహితులుగా కలిసున్నా.. తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. అయితే వీరి వివాహం చేసుకోవడం కంటే.. సహజీవనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అలాగే వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలను కూడా సుస్మిత గతంలో ఖండించింది. వీరిద్దరూ కలిసి చేసిన యోగా వీడియోలు, వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి కూడా. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట టూర్ చేస్తున్న ఫోటోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. 

సుస్మిత ప్రియుడు రొహ్మన్ షాల్ గతంలో శిల్పాశెట్టితో కలిసి "హియర్ మీ లవ్ మీ" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. చిత్రమేంటంటే.. రొహ్మన్ కన్నా సుస్మిత్ 15 సంవత్సరాలు పెద్దదట. అలాగే సుస్మితకు తానే తొలిసారి ప్రపోజ్ చేశారట. ఆ తర్వాత సుస్మిత కూడా రొహ్మన్ ప్రపోజల్ ఒప్పుకోవడం విశేషం. అలా ఒప్పుకున్న కొద్ది రోజులకి.. ఈ జంట డేటింగ్ చేయడం గమనార్హం. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన రొహ్మన్.. నోయిడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముంబయిలో మోడల్‌గా పనిచేస్తున్నారు.

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

ఇక సుస్మితా సేన్ విషయానికి వస్తే బీవీ నెంబర్ 1, ఫిలాల్, సమయ్ మొదలైన చిత్రాలలో నటనకు గాను పలు అవార్డులు, రివార్డులు పొందారు. అలాగే సేవా రంగంలో చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మక మదర్ థెరిస్సా పురస్కారాన్ని కూడా పొందారు సుస్మిత. చిత్రమేంటంటే.. సుస్మిత తన హై స్కూల్ స్టడీస్‌ను మన హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాలేజీలోనే పూర్తి చేశారట. అంతకు ముందు ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేశారు. అయితే ఆమె యాక్టింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టాక.. ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపకపోవడం గమనార్హం. 

చిత్రమేంటంటే.. ఈ సారి పుట్టినరోజు సందర్భంగా సుస్మిత్ ప్రియుడు.. తనకు ఓ సర్ ప్రైజ్ పార్టీని కూడా ప్లాన్ చేశాడు. అది చూసి మన విశ్వ సుందరి.. నిజంగానే ఆశ్చర్యపోయిందట. 

Image: Instagram.com/Susmitha Sen

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.