టాలీవుడ్‌లో మరో కొత్త హీరో.. మహేష్ బాబు మేనల్లుడు 'అశోక్ గల్లా'

టాలీవుడ్‌లో మరో కొత్త హీరో.. మహేష్ బాబు మేనల్లుడు 'అశోక్ గల్లా'

టాలీవుడ్‌కి (Tollywood) మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టర్ వద్ద శిష్యరికం చేసి.. ఇప్పుడు శ్రీ రామ్ ఆదిత్య (Sri Ram Aditya) దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆ యువనటుడే అశోక్ గల్లా (Ashok Galla). ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకి మేనల్లుడి వరసయ్యే అశోక్.. నటనలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జయదేవ్ సతీమణి పద్మావతి గల్లా నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ రామా నాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభించారు.

అందమైన ఫ్యామిలీ.. ఆనందాల లోగిలి... మహేష్ బాబు కుటుంబం

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుధీర్ బాబు, కేశినేని నాని, రానా దగ్గుబాటి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా.. జిబ్రాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కళ్యాణ్ శంకర్, ఏ.ఆర్.ఠాగూర్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నరేష్, అర్చన, సత్య ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

'మిస్ ఇండియా'ను ప్రేమించిన 'మిస్టర్ పర్ఫెక్ట్'.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?

గతంలో భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్‌కి దాదాపు కోటిన్నర రూపాయలు ఆఫర్ ఇచ్చారని వార్తలొచ్చాయి. ఇప్పటికే సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలలో నటించిన నిధి.. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాకి కూడా తాను సైన్ చేసింది. ఇక నటుడు అశోక్ గల్లా విషయానికి వస్తే.. టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ నుండి తాను నటనలో డిగ్రీ కూడా పొందాడట.

మహేష్ బాబు గారాలపట్టి "సితార" డ్యాన్స్ టాలెంట్.. మీరు కూడా చూస్తారా..?

 

అశోక్ గల్లా తండ్రి జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అమర్ రాజా గ్రూపుకి యజమాని అయిన జయదేవ్ దాదాపు 22 సంవత్సరాలు అమెరికాలోనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతిని వివాహమాడిన జయదేవ్.. 1992లో అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను తన తండ్రితో కలిసి స్థాపించారు. జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి కూడా రాజకీయాలలో ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఏపీ మహిళా కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.