(South Indian Actress Nayanthara Birthday Special)
ఆమె అచ్చమైన మలయాళీ భామ. కానీ తమిళంతో పాటు.. తెలుగు భాషలలో కూడా ఆమె తన నటనతో దుమ్ము లేపింది. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి అగ్ర కథానాయికగా వెలుగొందింది. ఒక సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన ఆమె.. ఆ తర్వాత హిందూ మతాన్ని స్వీకరించింది. తెలుగులో దాదాపు అగ్ర కథానాయకులు అందరితోనూ నటించిన ఆమె.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కూడా. అయినా తనదైన వ్యక్తిత్వంతో.. డేరింగ్ అండ్ డాషింగ్‌గా దూసుకుపోతున్న కథానాయికే.. మన అభినయ తార – నయనతార.
నయనతార పుట్టినరోజు సందర్భంగా.. ఆమె నటించిన సినిమాలలో.. టాప్ 5 చిత్రాలు మీకోసం ప్రత్యేకం
శ్రీ రామరాజ్యం – దిగ్దర్శకులు బాపు దర్శకత్వంలో నందమూరి బాలక్రిష్ణ నటించిన “శ్రీరామరాజ్యం” చిత్రంలో నయనతార .. సీతాదేవి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇదే పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తెలుగులో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా కైవసం చేసుకుంది.
రాజా రాణి – అట్లీ దర్శకత్వంలో ఆర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగులో కూడా డబ్ చేయబడి.. ఇక్కడ కూడా హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులో ఒక భగ్న ప్రేమికురాలి పాత్రతో పాటు.. ఓ సగటు ఇల్లాలి పాత్రలో కూడా తనదైన రీతిలో నటించి మెప్పించింది నయనతార. ఈ చిత్రంలో నటనకు కూడా ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది నయన్.
టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!
కర్తవ్యం – గోపీ నయనర్ దర్శకత్వంలో తమిళంలో “ఆరమ్” పేరుతో విడుదలైన చిత్రం.. తెలుగులో “కర్తవ్యం” పేరుతో విడుదలైంది. ఇందులో ఓ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషించిన నయనతార నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారిని కాపాడడానికి .. రిస్క్ చేసి మరీ నిర్ణయాలు తీసుకొనే ఓ బాధ్యతాయుతమైన అధికారి పాత్రలో నయనతారను ఈ చిత్రంలో మనం చూడవచ్చు. ఈ చిత్రంలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ పురస్కారంతో పాటు సైమా పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది నయనతార.
మయూరి – 2015లో “మాయ” పేరుతో విడుదలైన ఈ చిత్రం.. “మయూరి” పేరుతో తెలుగులో డబ్ చేయబడింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. నయనతార కూతురి భవిష్యత్తు కోసం తపించే.. సింగిల్ మదర్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా ఐఫా పురస్కారంతో పాటు.. ప్రతిష్టాత్మక కె.బాలచందర్ పురస్కారం కూడా గెలుచుకుందామె.
నయనతార ఒక్కరే కాదు.. వీరంతా డ్యుయెల్ రోల్స్‌లో అదరగొట్టిన వారే..!
అంజలి సీబీఐ – తమిళంలో “ఐమైక్క నోడిగల్” పేరుతో విడుదలైన ఈ చిత్రం “అంజలి సీబీఐ” పేరుతో విడుదలై.. ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనేందుకు.. పక్కా ప్రణాళిక రెడీ చేసే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నయనతార నటించిన తీరు ఈ చిత్రంలో అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రంలో నటనకుగాను ప్రతిష్టాత్మిక ఎడిసన్ అవార్డును కైవసం చేసుకుంది నయనతార.
నయనతార వివాహానికి.. ముహుర్తం ఖరారైందా..?
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.