నయనతార వివాహానికి.. ముహుర్తం ఖరారైందా..?

నయనతార వివాహానికి.. ముహుర్తం ఖరారైందా..?

తెలుగు, తమిళ భాషల్లో పేరెన్నిక గల చిత్రాలలో నటించిన నయనతార (Nayanthara).. త్వరలో వివాహం చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతకొంత కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో (Vignesh Shivan) నయన్ ప్రేమాయణం కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. పెళ్లి పీటలు కూడా ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి.


ఈ సంవత్సరం నవంబరులో నయన్, విఘ్నేశ్‌ల నిశ్చితార్థం జరగనుందని.. అలాగే 2020లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే వీరిరువురు ఇప్పటికే ఉంగరాలు మార్చుకున్నారని కూడా.. గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. 2015లో ‘నానుమ్‌ రౌడీదాన్’ అనే సినిమా షూటింగ్‌లో విఘ్నేశ్‌కు నయన్ పరిచయం అయ్యిందట. ఆ పరిచయం ప్రేమకు దారి తీయడం గమనార్హం.


గతకొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నయన్, విఘ్నేశ్ జంటకు సంబంధించిన ఫోటోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. దాంతో వారు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వారు తమ వివాహానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరా నరసింహారెడ్డి,మిస్టర్ లోకల్, దర్బార్ మొదలైన చిత్రాలలో నటిస్తోంది.


 

వెంకటేష్ నటించిన "లక్ష్మీ" చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. ఆ తర్వాత దుబాయ్ శీను, తులసి, అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలలో నటించింది.


దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. గతంలో ప్రభుదేవాను నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బంధానికి వేగంగానే బ్రేక్ పడింది.


ఇక నయనతార ప్రేమించిన వ్యక్తి విఘ్నేష్ శివన్ విషయానికి వస్తే.. ఆయన కోలీవుడ్‌లో ప్రముఖ పాటల రచయిత. ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ పాటలు రాసిన విఘ్నేష్.. 2012లో శింబు, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘పోడా పోడీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు.


అదే చిత్రం తెలుగులో ‘మన్మధన్ ఫర్ సేల్’ పేరుతో విడుదల అయ్యింది. తర్వాత 2015లో విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ‘నేను రౌడీ దాన్’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.


 

ఈ చిత్రం "నేను రౌడీనే" పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. 2015లో సూర్య, కీర్తి సురేష్ నటించిన ‘తాన స్రెంద కూటమ్’ అనే చిత్రానికి కూడా విఘ్నేష్ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రం "స్పెషల్ 26"కు రీమేకైన ఈ చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదలైంది. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు విఘ్నేష్.


ప్రస్తుతం నయన్, విఘ్నేశ్‌ల జోడీ దక్షిణాదిలోనే పాపులర్, హాటెస్ట్ కపుల్‌గా కితాబునందుకుంటోంది. తరచూ ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ ద్వారా పంచుకోవడం.. వివిధ ప్రాంతాలను కలిసి సందర్శించడం వీరికి అలవాటు. ఇటీవలే ఒకరి ఫ్యామిలీ మెంబర్స్‌తో మరొకరు ఫొటోలు కూడా తీసుకున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన డేట్ గురించి  తెలుసు కోవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే


ఇవి కూడా చదవండి


మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార


మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!


టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?