1 డిసెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

1 డిసెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (1 డిసెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు వివాహితులు పలు శుభవార్తలు వింటారు. ఈ క్రమంలో ధన, వస్తు, వాహన యోగాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఆలుమగల బంధాలు కూడా పటిష్టమవుతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఆలుమగల మధ్య అభిప్రాయల భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. నిరుద్యోగులు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి . 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే కుటుంబ వివాదాలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో అవనసర తగాదాలు పెట్టుకుకోకుండా ఉంటే శ్రేయస్కరం. కొన్ని నిర్ణయాలను వివేకంతో తీసుకోవాలి.  

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని లాభాలు కలిసొస్తాయి. అలాగే మొండిబాకీలు వసూలవుతాయి. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు.  విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆస్తి సంబంధిత చర్చలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆలుమగలు తొలుత అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటారు. అలాగే అనుకోని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే కార్యక్రమాలకు మీరు అతిథిగా హాజరవుతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి  ఇదే సరైన సమయం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు పలు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దాన, ధర్మాలు చేస్తారు.  విద్యార్థులు కొత్త కోర్సులలో జాయిన్ అవుతారు.  

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మిమ్మల్ని అనుకోని సంఘటనలు ప్రభావితం చేస్తాయి. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. ప్రేమికులు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత ఆందోళనకు గురవుతారు. ఎంత కష్టపడినా.. ఫలితం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. కొన్ని విషయాలలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే వివేకంతో వ్యవహరించాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

sadklnadsklnsadkln