11 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

11 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (11 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే అవివాహితులు ప్రేమలో పడతారు. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలలో నిరుద్యోగులు విజయం సాధిస్తారు. అయితే ఆదాయ, వ్యయాలను నియంత్రించుకోవడం మంచిది. 

వృషభం (Tarus) - ఈ రోజు మీరు కొన్ని మంచి విషయాలను వింటారు. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. మీ నిర్మాణాత్మక పనిలో పురోగతి ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సజావుగా సాగుతాయి. ఆలుమగల సంబంధాలు పటిష్టంగా మారతాయి. 

మిథునం (Gemini) - ఈ రోజు ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు ఉంటుంది. అలాగే వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కొన్ని సందర్భాలలో కోపాన్ని నియంత్రించుకోండి. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు ఈ రాశి వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆఫీసు వాతావరణం కూడా మీకు కొంత అసహనాన్ని కలిగించవచ్చు. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. తాము కోరుకున్న రంగాలలో విజయం సాధించగలరు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

క‌న్య (Virgo) - ఈ రోజు ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అందుకు కుటుంబ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఆఫీసులో ఉద్యోగులకు సీనియర్ల  మద్దతు ఉంటుంది. అదేవిధంగా  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే కొన్ని విషయాలలో తల్లిదండ్రుల నుండి సహకారాన్ని పొందుతారు. స్నేహితుల నుండి విలువైన బహుమతులను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీకు నిజంగానే కష్ట సమయం. ఇలాంటి పరిస్థితులలో మిమ్మల్ని మీ కుటుంబం లేదా  స్నేహితులు ఆదుకొనే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) -  ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో  సీనియర్ల నుండి అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులు అనుకోని అవకాశాలను పొందుతారు. కొత్తగా పెళ్లైన దంపతులు విహార యాత్రలు చేస్తారు.

మకరం (Capricorn) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని ప్రయోజనాలు పొందుతారు. అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆలుమగలు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. 

కుంభం (Aquarius) - ఈ రోజు మీరు సోమరితనాన్ని, బద్ధకాన్ని వీడండి. లేదంటే కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే వాణిజ్య ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో కోపాన్ని నియంత్రించండి. వివేకంతో ముందుకు వెళ్లండి. 

మీనం (Pisces) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆఫీసులో సీనియర్ల సహకారం తీసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.