12 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

12 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (12 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం


మేషం (Aries) - ఈ రోజు మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులు  ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే  పాత స్నేహితులను కలుస్తారు. 


వృషభం (Tarus) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే వివాహితులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులను ప్రత్యర్థులు ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 


మిథునం (Gemini) -  ఈ  రోజు విద్యార్థులు  పరధ్యానంలో పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం తగ్గినా... భయపడకుండా ముందుకు వెళ్లండి. కార్యదీక్షతో పనిచేయండి. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు.


కర్కాటకం (Cancer) -  ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే సంఘటనలను కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. వివాహితులు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో క్రియాశీలత పెరుగుతుంది. 


ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి


సింహం (Leo) - ఈ రోజు రాజకీయ నాయకులతో మీకు సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే వ్యాపారంలో అదనపు లాభాలు వస్తాయి. విద్యార్థులకు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.


క‌న్య (Virgo) - ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించి కుటుంబం నుండి ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.  తలెత్తుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 


'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?


తుల (Libra) - ఈ రోజు రక్తపోటు, తలనొప్పి లాంటి సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆఫీసులో లేదా ఇంట్లో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నించకండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగే వివాహితులు ఈ రోజు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. 


వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీరు అక్కరకు రాని స్నేహాలను దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని సంఘటనలు కుటుంబ అపార్థాలకు దారితీస్తాయి. వ్యాపారస్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


ధనుస్సు (Saggitarius) - ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు తమ బిజినెస్‌కు సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రేమికులు కొన్ని విషయాలలో అపార్థాలను తొలిగించుకుంటే మంచిది. 


మకరం (Capricorn) - ఈ రోజు ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది.  అలాగే మీ  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సామాజిక కార్యక్రమాలలో మీరు విరివిగా పాల్గొంటారు. 


కుంభం (Aquarius) - ఈ రోజు ప్రేమికులకు శుభదినం. మీ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి కూడా ఇదే సరైన సమయం. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం కలిగే అవకాశం ఉంది. ఆలుమగలు దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. 


మీనం (Pisces) -  ఈ రోజు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాలి. అలాగే వ్యాపారస్తులు తమ బిజినెస్ లావాదేవీలకు సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలుమగల మధ్య బంధం కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.