13 డిసెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

13 డిసెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (13 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం


మేషం (Aries) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార ఒప్పందాలు రద్దు అవుతాయి. వివాహితులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృషభం (Tarus) - ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. 

మిథునం (Gemini) -  ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త పరిచయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యాపారస్తులు రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే ఆలుమగలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అలాగే అపరిచితులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 

క‌న్య (Virgo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగులు ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని నిరాశాజనకమైన వార్తలను వింటారు. ఉద్యోగస్తులు ఆఫీసుకు సంబంధించిన వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  

వృశ్చికం (Scorpio) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కార దశకు వస్తాయి. అలాగే ఆలుమగలు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పలు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. వృత్తిపరమైన ఒప్పందాల విషయంలో ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందాలంటే ఇంకాస్త కష్టపడాలి. సామాజిక గౌరవం పెరుగుతుంది

మకరం (Capricorn) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే సీనియర్ల నుండి పలు సలహాలు, సూచనలు తీసుకుంటారు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే ఇంటర్వ్యూలలో విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారంలో హెచ్చుతగ్గులు కొనసాగుతాయి. వివాహితులు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. 

మీనం (Pisces) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. లాటరీలు లేదా స్కీముల ద్వారా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహితులు కొన్ని ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.