14 డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

14  డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

ఈ రోజు (14 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే విద్యార్థులు ఇంకాస్త కష్టపడడం మంచిది. ఉద్యోగస్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Tarus) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆలుమగల బంధాలు కూడా పటిష్టంగా మారతాయి.  అలాగే వాహనాల నిర్వహణపై శ్రద్ధ వహించండి.

మిథునం (Gemini) -  ఈ రోజు పలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు విరివిగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయణాలు చేస్తారు. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు విద్యార్థులు అనుకోని విజయాలను కైవసం చేసుకుంటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.  ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. నిరుద్యోగులు కొన్ని విషయాలలో బద్ధకాన్ని వీడి.. అవకాశాల కోసం ప్రయత్నించాలి. 

క‌న్య (Virgo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని సంఘటనల వల్ల ప్రభావితమవుతారు. అలాగే ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. కొత్త పరిచయాలు మీ జీవితంలో అనుకోని మార్పులను తీసుకొస్తాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సుదూర ప్రయాణాలు చేస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి విదేశాలకు వెళ్ళేందుకు ప్రణాళికలు రచిస్తారు. పెండింగ్ పనులు వేగంగానే పూర్తవుతాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీ చిరకాల మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. అలాగే విద్యార్థులకు లేదా నిరుద్యోగులకు తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులు తమ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. కొన్ని విషయాలలో ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవడం ముఖ్యం. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆహార నియమాలు పాటించడంలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మకరం (Capricorn) - ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. అలాగే ఆర్థికంగా కూడా కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 

కుంభం (Aquarius) - ఈ రోజు ప్రేమికులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. అలాగే మీ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నింవచ్చు.

మీనం (Pisces) - ఈ రోజు ఉద్యోగస్తులు కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో మీ ప్రమోషన్లు ఆగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ పార్ట్‌నర్స్‌తో చర్చలు జరిపే విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. అలాగే వివాహితులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.