17 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

17 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (17 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు విద్యార్థులకు కళలు లేదా క్రీడా రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వివాహితులు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

వృషభం (Tarus) - ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కొన్ని విషయాలలో మీరు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వామితో సానుకూలంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడంలో విజయం సాధిస్తారు.

మిథునం (Gemini) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనాన్ని వీడాలి. అలాగే వ్యాపారస్తులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు కొన్ని అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు మీరు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ప్రేమికులకు ఈవేళ శుభదినం. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. విద్యార్థులు బద్ధకం లేదా నిర్లక్ష్యం కారణంగా.. అనవసరమైన సమస్యలను ఎదుర్కొంటారు. 

క‌న్య (Virgo) - ఈ రోజు వ్యాపారస్తులు ఏదో తెలియని మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే అవివాహితులు పలు శుభవార్తలు వింటారు.  కళ్యాణ ఘడియలు దగ్గరపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే మీ భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు విద్యార్థులు లేదా నిరుద్యోగులకు శుభదినం. మీరు కోరుకున్న రంగాలలో విజయం సాధిస్తారు. వివాహితులకు కుటుంబ జీవితం సరదాగా సాగుతుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొందరి వల్ల బాగా ప్రభావితమవుతారు. అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బద్ధకానికి స్వస్తి పలకాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యకలాపాల విషయంలో ఆసక్తి పెరుగుతుంది. 

మకరం (Capricorn) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.  ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు లేదా భాగస్వామి సూచనలను పాటించాలి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. 

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కొన్ని నిర్ణయాలను తీసుకొనేటప్పుడు పెద్దల సలహాలు, సూచనలు అవసరం. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మీనం (Pisces) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులకు సామాజిక గౌరవం పెరగుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.