20 డిసెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

20 డిసెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (20 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు  మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనం పొందుతాయి. రాజకీయాల్లో జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది.

వృషభం (Tarus) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉపాధి రంగంలో విజయం సాధిస్తారు. కొత్త  ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. వ్యాపారస్తులు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అలాగే ఆత్మీయుల వద్ద కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి.

మిథునం (Gemini) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. అలాగే విలువైన వస్తువులను కోల్పోతారు. కొన్ని ప్రాజెక్టులలో డబ్బు పెట్టుబడి ముందు.. నూటికి పదిసార్లు ఆలోచించండి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి.

కర్కాటకం (Cancer) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పెద్దలతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించండి. మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు ఎదురవుతాయి. అనుకోకుండా వచ్చిన డబ్బుతో సమస్యలు ఎదురవుతాయి. ఆఫీసులో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు  కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల నుండి ఖరీదైన బహుమతులు కూడా పొందుతారు. మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రమోషన్‌కు దారితీసే అవకాశం ఉంది. 

క‌న్య (Virgo) - ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అదనపు ప్రయోజనాలు అందుతాయి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. భాగస్వామితో కొన్ని విషయాలలో మీకు విభేదాలు ఏర్పడవచ్చు. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) -  ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో విద్యార్థులు విజయం సాధిస్తారు.

వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీరు అనుకోని కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తూ.. కెరీర్ మారే అవకాశం ఉంది. అలాగే పనికిరాని వాదనలకు దూరంగా ఉండండి. అలాగే కొత్త సంబంధాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే మిత్రులు లేదా బంధువుల నుండి బహుమతులు, కానుకలు పొందుతారు. అదేవిధంగా వృత్తిపరమైన ఒప్పందాలు ప్రయోజనం పొందుతాయి. భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి.

మకరం (Capricorn) - ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే లైసెన్స్ లేకుండా చేసే వ్యాపారాలు సమస్యలను కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. 

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని విషయాలను కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త ఒప్పందాలు మీకు అనుకోని లాభాలను తెచ్చే పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

మీనం (Pisces) - ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో ఇరుక్కుంటారు. అలాగే కొత్త వ్యక్తులను కలవడం మీకు సంతోషాన్నిస్తుంది. రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరస్మరణీయమైన క్షణాలను స్నేహితులతో పంచుకుంటారు. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు