ADVERTISEMENT
home / Astrology
21 డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

21 డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (21 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  వివాహితులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. వృత్తి విస్తరణకు అవకాశం ఉంది. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో.. తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆఫీసులో అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. చట్టపరమైన విషయాల్లో విజయం సిద్దిస్తుంది.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) –  ఈ రోజు సినిమా లేదా మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది.  ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వివాహితులు శుభవార్తలు వింటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు మీరు మీ బంధువుల నుండి శుభవార్తలు వింటారు.  అలాగే అవివాహితులు ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి రొమాంటిక్ యాత్రలు చేస్తారు. వ్యాపారం లేదా ఉద్యోగంలో సహోద్యోగుల సహాయంతో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. ప్రత్యర్థుల సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. వృత్తి విస్తరణకు అవకాశం ఉంది. సామాజిక సంస్థల నుండి సత్కారాలు పొందుతారు. 

ADVERTISEMENT

‘డిసెంబరు’ నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా ‘ప్రత్యేకం’ : ఎందుకో తెలుసా..?

తుల (Libra) – ఈ రోజు మీరు పలు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.  అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు అనుకోని ఇబ్భందులలో చిక్కుకుంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఆఫీసులో నిర్లక్ష్యంతో చేసే.. చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలను కలిగిస్తాయి. కొన్ని వివాదాలకు మీరు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో అనుకోని సమస్యలు ఏర్పడతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థిక సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరగవచ్చు. కొన్ని విషయాలలో, తెలివైన నిర్ణయాలు తీసుకోండి. సామాజిక కార్యకలాపాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీ వ్యాపార పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కార్యాలయంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. మీ భాగస్వామితో అనుకోకుండా అభిప్రాయ భేదాలు తలెత్తినా.. తర్వాత అవి సమసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. అలాగే విద్యార్థులకు కళలు లేదా క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల నుండి మద్దతు ఉంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఆఫీసులో కొన్ని సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. అలాగే కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శుభవార్తలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

20 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT