ఈ రోజు (24 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అలాగే మీ తల్లిదండ్రులతో చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు.
వృషభం (Tarus) – ఈ రోజు వివాహితులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. అలాగే ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలాగే ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులు కొత్త వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన అవకాశం.
మిథునం (Gemini) – ఈ రోజు తల్లిదండ్రులు అందించే విలువైన సలహాలను పాటించండి. అలాగే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు మీ పాత మిత్రులను కలుస్తారు. అలాగే కొన్ని ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. మహిళలు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలలో.. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
సింహం (Leo) – ఈ రోజు మీరు ఉద్యోగ జీవితంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అపరిచితులతో లావాదేవీలు జరిపే సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కోర్టు కేసులు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
కన్య (Virgo) – ఈ రోజు మీరు ఊహించని ఇబ్బందులలో పడతారు. వివాహితులు పలు సామాజిక కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు తమ ఓటమిని అంగీకరిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది.
‘డిసెంబరు’ నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా ‘ప్రత్యేకం’ : ఎందుకో తెలుసా..?
తుల (Libra) – ఈ రోజు మీకు ఆఫీసులో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొత్త వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులకు సులభ ధనయోగం ఉంటుంది. ఆర్థిక విషయాలలో మీకు మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఊహించని మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమకు ప్రియమైన వ్యక్తులను కలుస్తారు. అలాగే ప్రేమికులు ఎదుటివారికి తమ మనసులోని మాటను చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే వివాహితులు తమ భాగస్వామితో సంబంధాలను మెరుగుపరచుకుంటారు. కొన్ని విషయాలలో మీకు మీ కుటుంబీకుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల సహకారం లభిస్తుంది.
మకరం (Capricorn) – ఈ రోజు విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. అలాగే యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులతో మీ విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల సలహాలను తీసుకోండి. రాజకీయ నాయకులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు వ్యాపార విషయాలలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. వివాహితులకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది.
మీనం (Pisces) – ఈ రోజు మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.