25 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

25 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

ఈ రోజు (25 డిసెంబరు) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు మీ ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. అలాగే స్నేహితుల నుండి బహుమతులు పొందుతారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మహిళలు అపరిచితులతో జాగరూకతతో వ్యవహరించండి. విద్యార్థులు మనోధైర్యం కోసం యోగా లేదా మెడిటేషన్ చేయండి. అలాగే, కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీల నుండి విముక్తి పొందుతారు. 

వృషభం (Tarus) – ఈ రోజు ఆఫీసులో ఉద్యోగులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను స్వీకరిస్తారు. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేవలం నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు చాలా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. వివాహితులకు తమ భాగస్వామి నుండి మద్దతు, సహకారం లభిస్తాయి. 

మిథునం (Gemini) –  ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే వివాహితులకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగస్తులు వేరే రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీకు మీ స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది.  పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఆఫీసులో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీకు సంబంధం లేని వివాదాల జోలికి పోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు.. శక్తివంచన లేకుండా చదవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  ఈ రోజు మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. కొన్ని విషయాలలో నిజాయతీతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అయినా సహనాన్ని కోల్పోవద్దు. కోపాన్ని నియంత్రించండి. మీరు కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే, పనిపై దృష్టి పెట్టండి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పేయడం మంచిది. అప్పుడే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే వివాహితులు కూడా.. తమ మనసులోని భావాలను భాగస్వామితో పంచుకోండి. ఉద్యోగస్తులు బద్దకాన్ని వీడి.. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు కొన్ని ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. అలాగే కోపాన్ని నియంత్రించుకొని.. కొన్ని సందర్బాల్లో సంయమనంతో మెలగాల్సి ఉంటుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి. అలాగే రాజకీయ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు బదిలీలు సంభవిస్తాయి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో సంయమనంతో వ్యవహరించండి. వ్యక్తిగత సమస్యలను చర్చలతో పరిష్కరించుకోండి. అలాగే ఉద్యోగస్తులు పని ఒత్తిడిలో పడి.. భాగస్వామికి సమయం కేటాయించడం మరిచిపోవద్దు. వ్యాపారస్తులు వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు సోమరితనాన్ని వీడాలి. అప్పుడే అనుకున్న పనులు.. అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను నిజాయతీగా పూర్తిచేయాలి. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మీనం (Pisces) – ఈ రోజు కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు కొనాలనే మీ కల కూడా పూర్తవుతుంది. వ్యాపారస్తులు అనుకోని లాభాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించే అవకాశముంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు