03 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

03 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (3 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - ఈ రోజు యువత భవిష్యత్తు కెరీర్ కోసం ఆలోచనలు చేస్తారు. వ్యాపారస్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. అలాగే కొన్ని విషాద వార్తలు వినాల్సి రావచ్చు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

వృషభం (Tarus) -  ఈ రోజు ఈ రాశి వారికి సులభ ధనయోగం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. 

మిథునం (Gemini) - ఈ రోజు విద్యార్థులకు అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. రాజకీయ నాయకులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. వివాహితులు పలు శుభకార్యాలలో పాల్గొంటారు. 

కర్కాటకం (Cancer) - ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. ఆకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన భాగస్వామ్యాలు ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

సింహం (Leo) - ఈ రోజు అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. వివాహితులు.. తమ భాగస్వామితో సరదాగా గడుపుతారు. ఆఫీసులో ఉద్యోగస్తులకు సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

క‌న్య (Virgo) - ఈ రోజు నిరుద్యోగులకు ఉపాధి రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. సామాజిక గౌరవం పొందుతారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) - ఈ రోజు మీకు అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా అనుకోని నష్టాలు చవిచూస్తారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. ప్రేమికులు తమ బంధం గురించి పెద్దలతో చెప్పడానికి ఇదే సరైన సమయం.

వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. వీలైతే ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సమస్యలు పరష్కారమవుతాయి. వృత్తిపరమైన క్రెడిట్ కూడా పొందుతారు. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి . రాజకీయాల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే అనుకోని ఆహ్వానాలు పొందుతారు. 

మకరం (Capricorn) - ఈ రోజు మీరు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సామాజిక ఖ్యాతి, సంపద పెరుగుతాయి. వివాహితులకు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. 

కుంభం (Aquarius) - ఈ రోజు మీరు మీ జీవితానికి సంబంధించి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అలాగే అనుకోని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

మీనం (Pisces) - ఈ రోజు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి.. మీ తల్లిదండ్రుల సలహాలు అవసరం. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయలో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు కేసులు పరిష్కార దశకు వస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.