ఈ రోజు (05 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. చట్టపరమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆలుమగల సంబంధాలు మరింత బలపడతాయి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ సమస్యల పరిష్కారానికి.. మీ పిల్లల తోడ్పాటును తీసుకుంటారు. కుటుంబ వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో ఉద్యోగస్తులకు కొన్ని విషయాలలో నియంత్రణ ఉంటుంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఆఫీసులో మీకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. వ్యాపారస్తులు కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించడం మేలు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అలాగే ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయాలలో మీకు మిత్రుల నుండి మద్దతు లభిస్తుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అధిక పనిభారంతో సతమతమవుతారు. అలాగే కొంత అలసటకు గురవుతారు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మీకు మీ భాగస్వామి నుండి అన్ని విషయాలలో మద్దతు ఉంటుంది. పలు శుభవార్తలు కూడా వింటారు.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో అనుకోని ఆందోళనకు గురవుతారు. కుటుంబ వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
తుల (Libra) – ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వంతో ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు. అలాగే పాత స్నేహితుల సహాయంతో, కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వివాదాలు, కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఆఫీసులో మీదైన శైలిలో పనిచేస్తూ.. పలువురిని ఆకట్టుకుంటారు. మీ వ్యక్తిత్వానికి కొందరు ప్రభావితం అవుతారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ సన్నిహితులు మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. అలాగే మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. వాహనాల నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు. అదేవిధంగా అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn) – ఈ రోజు మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. అలాగే ఆఫీసులో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు వ్యాపారాన్ని ప్రయోజనాన్ని ఆశించి చేయకపోవడం మంచిది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు.
కుంభం (Aquarius) – ఈ రోజు ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఒకరికి తెలియకుండా మరొకరు నిర్ణయాలు తీసుకోకపోవడం శ్రేయస్కరం. అలాగే ఆఫీసులో సీనియర్లతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయ, వ్యయాలను నియంత్రించుకోవడం మంచిది.
మీనం (Pisces) – ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు లాభసాటిగా ఉంటుంది. అయితే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.