ఈ రోజు (09 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Tarus) – ఈ రోజు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనం పొందుతాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి.
మిథునం (Gemini) – ఈ రోజు ప్రేమికులు కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం తగదు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తుల ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ప్రత్యర్థులు కొన్ని విషయాలలో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని లాభాలను చూస్తారు. అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆలుమగలు పలు శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లల తల్లిదండ్రుల నుండి అమితమైన ప్రేమ. ఆప్యాయతలను పొందుతారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టడతారు. అలాగే సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. కొన్ని పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అదేవిధంగా కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో అనుబంధం మరింత పటిష్టమవుతుంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో పలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో పలు శుభకార్యాలలో పాల్గొంటారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు విద్యార్థులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులు కొత్త కెరీర్ వైపు అడుగులు వేసే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు అనవసరమైన వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. లేదంటే మనస్పర్థలు వస్తాయి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కొన్ని సెమినార్లు లేదా విద్యా సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు కొన్ని అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయే పనులకు స్వస్తి పలకాలి.
కుంభం (Aquarius) – ఈ రోజు మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. పాత మిత్రులు మిమ్మల్ని సందర్శిస్తారు. ఆలుమగల మధ్య మనస్పర్థలు తొలిగిపోతాయి. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు చాలా ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులు తొలుత కొంత ఒత్తిడికి గురైనా.. తర్వాత తమ పనులు తాము నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్తారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.