Birthday Special : స్వర మాంత్రికుడు ఎ. ఆర్. రెహమాన్ అభిమానుల కోసం.. ఈ టాప్ 10 సాంగ్స్

Birthday Special : స్వర మాంత్రికుడు ఎ. ఆర్. రెహమాన్ అభిమానుల కోసం.. ఈ టాప్ 10 సాంగ్స్

Birthday Special : Top Ten Hit Songs of Music Legend AR Rahman

భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటి.. ఆస్కార్ అవార్డుకే అందాన్ని తీసుకొచ్చిన అపర సంగీత కోవిదుడు ఎ. ఆర్. రెహమాన్ . సంగీతమే ఆయన ఊపిరి.. స్వర కల్పనే ఆయన ప్రాణం. అందుకే అది ఎప్పటికీ ఆయన జీవితంలో మమేకమైపోయింది. కీబోర్డు ప్లేయర్‌గా రెహమాన్ తన కెరీర్ ప్రారంభించినా.. తర్వాత ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సక్సెస్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే రాక్ బ్యాండ్ నిర్వహించిన రెహమాన్.. తెలుగు సంగీత దర్శకుడు కోటి దగ్గర కూడా కొన్నాళ్లు పనిచేశాడు.

ఒక రకంగా చెప్పాలంటే.. మణిరత్నం చిత్రం 'రోజా'.. రెహమాన్ జీవితాన్ని మార్చిందని చెప్పవచ్చు. ఆ సినిమా ఆడియా సూపర్ సక్సెస్ అయ్యాక ఆయన అసలు వెనుదిరిగి చూసుకోలేదు. ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. జెంటిల్ మేన్, డ్యూయెట్, బొంబాయి, రంగీలా, భారతీయుడు, ఇద్దరు, జీన్స్, దిల్ సే, లగాన్, బాయ్స్, యువ, రంగ్ దే బసంతీ, నాని, శివాజీ, గజిని.. ఇలా ఎన్నని చెబుతాం. కొన్ని సినిమాలు కేవలం రెహమాన్ సంగీతం కారణంగానే హిట్ అయిన సందర్భాలున్నాయి. ఈ రోజు ఆ గొప్ప స్వర మాంత్రికుడి జన్మదినం సందర్భంగా.. ఆయన సినిమాల్లోని టాప్ 10 సాంగ్స్ మీకోసం

1. చిన్ని చిన్ని ఆశ
చిత్రం - రోజా
పాడినవారు - మిన్మిని
రచన - రాజశ్రీ

2. చికుబుకు చికుబకు రైలే
చిత్రం - జెంటిల్ మేన్
పాడినవారు - సురేష్ పీటర్స్, జివి ప్రకాష్ కుమార్
రచన - రాజశ్రీ

 

3. పచ్చని చిలుకలు తోడుంటే
చిత్రం - భారతీయుడు
గానం - జేసుదాసు
రచన - భువనచంద్ర

4. అంజలీ అంజలీ పుష్పాంజలి
చిత్రం - డ్యూయెట్
గానం - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
రచన - వెన్నెలకంటి

5. పూవుల్లో దాగున్న
చిత్రం - జీన్స్
గానం - ఉన్నిక్రిష్ణన్, సుజాతా మోహన్
రచన - ఏ.ఎం.రత్నం

6. మా తుఝే సలామ్
ఆల్బమ్ - వందేమాతరం
గానం - ఏ.ఆర్.రెహమాన్
రచన - మెహబూబ్

7. పెదవే పలికిన మాటల్లోని
చిత్రం - నాని
గానం - సాధనా సర్గమ్, ఉన్నిక్రిష్ణన్
రచన - చంద్రబోస్

8. గుజారిష్
చిత్రం - గజిని
గానం - జావేద్ అలీ, సోనూ నిగమ్
రచన - ప్రసూన్ జోషి

 

9. ఉరికే చిలుకా
చిత్రం - బొంబాయి
గానం - హరిహరన్, కె.ఎస్.చిత్ర
రచన - వేటూరి

10. బుల్లిగువ్వ
చిత్రం - 2.0
గానం - కీరవాణి, అమీన్
రచన - అనంత్ శ్రీరామ్

ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

Tollywood Best Songs 2019 : ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!

"ప‌ల్లె కోయిల" ప‌స‌ల బేబీ నోట.. హృద్యమైన మట్టి మనిషి పాట..!

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.