ఈ రోజు (01 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు నుండి మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. అయితే సాధ్యమైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఉద్యోగస్తులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు తాము కోరుకున్న రంగాలలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు నుండి మీరు సరికొత్త పథకాలను రచిస్తారు. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే.. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు నుండి మీరు చేపట్టే పనులు తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. రాను రాను ప్రగతి మార్గాన పయనిస్తాయి. ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వైపు ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు నుండి మీరు వైవాహిక జీవితంలో.. ఎనలేని ఆనందాన్ని చవిచూస్తారు. అలాగే వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో కొన్ని విషయాలలో రాజీ పడతారు. పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటారు. కానీ అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి.
సింహ రాశి (Leo) – ఈ రోజు నుండి ఉద్యోగస్తులు మరింత కష్టపడి పనిచేయాలి. కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. అలాగే వ్యాపారస్తులకు, మహిళలకు సులభ ధనయోగం ఉంటుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి.
కన్య రాశి (Virgo) – ఈ రోజు నుండి మీరు తల్లిదండ్రుల నుండి అదనపు సహాయాన్ని పొందుతారు. అలాగే మహిళలు శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారస్తులు వాణిజ్య విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
తుల రాశి (Libra) – ఈ రోజు నుండి మీరు కెరీర్ విషయంలో సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు మంచి పోటీవాతావరణాన్ని తట్టుకుంటారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు నుండి మీరు ఆశావాదాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మీ ఆఫీసు లేదా పని ప్రదేశంలోని వాతావరణం మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని విషయాలలో మీరు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.
ధను రాశి (Saggitarius) – ఈ రోజు నుండి ప్రేమికుల సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
మకర రాశి (Capricorn) – ఈ రోజు నుండి విద్యార్థులు, నిరుద్యోగులు మరింత కష్టపడాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో మొండిగా ముందుకు సాగిపోవాలి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు నుండి వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీ బద్దకం లేదా నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అలాగే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.
మీన రాశి (Pisces) – ఈ రోజు నుండి మీరు అన్ని సమస్యలకు దూరంగా వెళ్లి… కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. మిత్రులు లేదా సన్నిహితులతో కలిసి కొంత సమయం గడపండి. అలాగే అనుకోని సంఘటనలు మీకు ఎదురవుతాయి. అలాగే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.