ADVERTISEMENT
home / Astrology
11 జనవరి 2020 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

11 జనవరి 2020 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (11 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే విద్యార్థులు కొందరు వ్యక్తుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది.  వివాహితులు పలు దాంపత్య సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితులు పలు శుభకార్యాలకు హాజరవుతారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) –  ఈ రోజు సినిమా లేదా మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు అనుకోని లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు మీరు ఊహించిన సంఘటనలను ఎదుర్కొంటారు.  అలాగే అవివాహితులు ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తిచేయడం మంచిది. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. ప్రత్యర్థుల సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. సామాజిక సంస్థల నుండి సత్కారాలు పొందుతారు. 

ADVERTISEMENT

‘డిసెంబరు’ నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా ‘ప్రత్యేకం’ : ఎందుకో తెలుసా..?

తుల (Libra) – ఈ రోజు మీరు పలు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.  అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు అనుకోని ఇబ్భందులలో చిక్కుకుంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే కొన్ని వివాదాలకు  దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకోని సమస్యలు ఏర్పడతాయి. వివాహితులు భాగస్వామితో పొరపొచ్చాలు వచ్చినా… ఆ తర్వాత సర్దుకుపోతారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు కోపతాపాలకు దూరంగా ఉండండి. అలాగే నిరుద్యోగులకు కాస్త ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరగవచ్చు. కొన్ని విషయాలలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి. మీరు సామాజిక కార్యకలాపాల్లో కూడా విరివిగా పాల్గొంటారు. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీరు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఎంత బిజీగా ఉన్నా.. మీ భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. అలాగే విద్యార్థులకు కళలు లేదా క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఆఫీసులో కొన్ని సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. అలాగే కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శుభవార్తలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి.

ADVERTISEMENT

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

10 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT