ADVERTISEMENT
home / Astrology
13 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

13 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (13 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీరు అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఆఫీసు వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది.  విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  వివాహితులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారస్తులు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. 

వృషభం (Tarus) – ఈ రోజు ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వివాహితులు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త స్నేహితులు ఏర్పడతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు మీరు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆఫీసులో ఉద్యోగులకు అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చట్టపరమైన లావాదేవీలతో జాగ్రత్త వహించండి. 

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) –  ఈ రోజు సినిమా లేదా మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది.  ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహితులు అనుకోని శుభవార్తలు వింటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు మీరు జీవితానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు.  అలాగే అవివాహితులు ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే పాత మిత్రులను కలుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. ప్రత్యర్థుల సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. వృత్తి విస్తరణకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.

ADVERTISEMENT

‘డిసెంబరు’ నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా ‘ప్రత్యేకం’ : ఎందుకో తెలుసా..?

తుల (Libra) – ఈ రోజు మీరు మీ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు అనుకోని ఇబ్భందులలో చిక్కుకుంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారంలో అనుకోని సమస్యలు ఏర్పడతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పలు విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. విద్యార్థులు కెరీర్ విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. వివాహితులు సామాజిక కార్యకలాపాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీ వ్యాపార పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త భాగస్వాములతో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆలుమగల మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు తలెత్తినా.. తర్వాత అవి సమసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. అలాగే ఆడపిల్లలకు కళలు లేదా క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల నుండి మద్దతు ఉంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

ADVERTISEMENT

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

13 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT