16 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

16 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (16 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.  ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలుమగల బంధాలు కూడా  మరింత పటిష్టమవుతాయి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఆలుమగల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు వచ్చినా.. తర్వాత వారు సర్దుకుపోతారు. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే ఆఫీసు వివాదాలకు దూరంగా ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను పంచుకోవడం మంచిది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు మొండిబాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబ బంధాలు పటిష్టమవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు వింటారు.  విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో ప్రతికూల ఆలోచనలను వీడాలి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తమ జీవితానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను మిత్రులతో చర్చిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. అయితే అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పాత మిత్రులను కలుస్తారు. అలాగే అనుకోని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపిస్తారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి  ఇదే సరైన సమయం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఆలుమగలు నూతన నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే విహార యాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు బిజినెస్ మీటింగ్‌లకు హాజరవుతారు. అలాగే దాన, ధర్మాలు చేస్తారు.  విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మిమ్మల్ని అనుకోని సంఘటనలు ప్రభావితం చేస్తాయి. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ప్రేమికులు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. అలాగే ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంటారు. అదేవిధంగా వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. అలాగే తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని కొన్ని విషయాలలో ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటప్పుడే ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి