23 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

23 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (23 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు విద్యార్థులు పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు ధన, వస్తు, వాహన యోగాలను పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమికుల బంధాలు కూడా పటిష్టమవుతాయి. మహిళలకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ప్రేమికుల మధ్య అభిప్రాయల భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వివాహితులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. మహిళలు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి . 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వివాదాలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలి. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే కొన్ని నిర్ణయాలను వివేకంతో తీసుకోవాలి.  

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని లాభాలు కలిసొస్తాయి. అలాగే మొండిబాకీలు కూడా వసూలవుతాయి. ఆఫీసులో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.  విద్యార్థులకు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రేమికుల మధ్య తొలుత అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనుకోని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో మరొకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి.  అలాగే వివాహితులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు పలు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దాన, ధర్మాలు చేస్తారు.  విద్యార్థులకు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు శత్రువులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. ప్రేమికులు అనుకోని ఇబ్బందులలో చిక్కుకొనే అవకాశం ఉంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దూర ప్రాంతాలను సందర్శిస్తారు. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. కొన్ని విషయాలలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి