3 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

3 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (3 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే  వివాహితులకు మరిన్ని కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఆర్థికంగా బలంగా ఉంటుంది. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. 

వృషభం (Tarus) – ఈ రోజు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. అలాగే మహిళలకు  అనుకోని బహుమతులు లేదా ఖరీదైన కానుకలు అందుతాయి.  విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సిద్ధిస్తుంది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

మిథునం (Gemini) – ఈ రోజు ఉద్యోగస్తులకు తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.  అలాగే వ్యాపారస్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.  ఇక అవివాహితులు శుభవార్తలు వింటారు. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer) –   ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారుల ప్రశంసలు పొందుతారు. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు మీరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహితులు కుటుంబ సమస్యల నుండి కాస్త ఉపశమనం పొందుతారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు విజయం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు జాబ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు తమ భాగస్వామి వద్ద కొన్ని విషయాలను దాచకుండా ఉంటే మంచిది.

తుల (Libra) – ఈ రోజు వ్యాపారస్తులు అనుకోని సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే  ఒప్పందాలను రద్దు చేసుకోవడం వల్ల ఊహించని పరిణమాలు ఎదురవుతాయి. అదేవిధంగా వాహన నిర్వహణలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు నిజాయతీగా పనిచేయడానికి ప్రయత్నించాలి.

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే  పెండింగ్ పనులన్నీ కూడా ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ రోజు ఈ రాశివారికి బాగుంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు బంధువులతో పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అయినా సహనంతో వ్యవహరించండి. కొన్ని సమస్యలను వివేకంతో పరిష్కరించుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించండి. . 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ చూపించండి. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఉద్యోగస్తులు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే మీ కుటుంబంలో వివాహితులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని ప్రాజెక్టులు లభిస్తాయి. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. పలు విషయాలలో స్నేహితులు లేదా సోదరులు మిమ్మల్ని ఆదుకుంటారు. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం బాగుంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో అదనపు ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.