4 జనవరి 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

4 జనవరి 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (4 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే  అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు లాభసాటిగా ఉంటుంది. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి.

వృషభం (Tarus) – ఈ రోజు సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వారికి లాభసాటిగా ఉంటుంది. అలాగే మహిళలకు సులభ ధనయోగం ఉంటుంది.  అనుకోని బహుమతులు లేదా ఖరీదైన కానుకలు అందుతాయి. నిరుద్యోగులు నిర్లక్ష్యాన్ని వీడితే.. ఊహించని అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు.  అలాగే ఉద్యోగస్తులు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు.  వివాహితులకు తమ భాగస్వామితో పొరపొచ్చాలు వచ్చినా.. వేగంగానే సర్దుకుపోతారు. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer) –   ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఖర్చులను తగ్గించుకోవడం శ్రేయస్కరం. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు మీరు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆఫీసులో పనిభారం కూడా పెరుగుతుంది.   వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం.

క‌న్య (Virgo) – ఈ రోజు నిరుద్యోగులు పలు శుభవార్తలు వింటారు. అలాగే ప్రత్యమ్నాయ రంగాలలో కూడా అవకాశాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు జాబ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కొన్ని విషయాలలో ఏజెంట్లతో కఠినంగా వ్యవహరించాలి. వివాహితులు తమ భాగస్వామి వద్ద కొన్ని విషయాలను దాచకుండా ఉంటే మంచిది.

తుల (Libra) – ఈ రోజు ఉద్యోగస్తులు తమ ప్రత్యర్థుల నుండి అనుకోని సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త  ఒప్పందాలను రద్దు చేసుకోవడం వల్ల ఊహించని పరిణమాలు ఎదురవుతాయి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి వార్తలు వింటారు. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే  పెండింగ్ పనులన్నీ కూడా ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులు దూర ప్రయాణం చేస్తారు. పాత స్నేహితులను కూడా కలుస్తారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ రోజు ఈ రాశివారికి బాగుంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసులు వంటివి ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కొన్ని విషయాలలో సహనంతో వ్యవహరించడం మేలు. అలాగే అనుకోకుండా తలెత్తే వివాదాలను వివేకంతో పరిష్కరించుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించండి. . 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ చూపించాలి. అలాగే అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకాలి. ఉద్యోగస్తులు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని అవకాశాలు లభిస్తాయి.

మీనం (Pisces) – ఈ రోజు మీరు అనుకోని పరిణామాలను ఎదుర్కొంటారు. అలాగే పలు విషయాలలో స్నేహితులు లేదా సోదరులు మిమ్మల్ని ఆదుకుంటారు. మహిళలు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.