14 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

14 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (14 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే వీరికి కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధన, వస్తు, వాహన యోగాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఆలుమగల బంధాలు కూడా  మరింత పటిష్టమవుతాయి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు విద్యార్థులు మరింత కష్టపడాలి. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చినా.. తర్వాత వారు సర్దుకుపోతారు. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే కుటుంబ వివాదాలను దూరంగా ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను పంచుకోవడం మంచిది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలను వివేకంతో తీసుకోవాలి.  

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని లాభాలు వస్తాయి. అలాగే మొండిబాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు వింటారు.  విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో సానుకూలంగా ఆలోచించాలి. అదేవిధంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం మంచిది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను చేస్తారు. అలాగే అనుకోని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే పలు కార్యక్రమాలకు మీరు అతిథిగా హాజరవుతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి  ఇదే సరైన సమయం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికులు నూతన నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే దాన, ధర్మాలు చేస్తారు.  విద్యార్థులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు అనుకోని సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి. ప్రేమికులు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. అదేవిధంగా వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు ఎంత కష్టపడినా.. ఫలితాలు దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. కొన్ని విషయాలలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే వివేకంతో వ్యవహరించాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి