ఆవకాయతో సహా.. 1000 రకాల పచ్చళ్లు :రికార్డులు సృష్టిస్తున్న 'పికెల్ క్వీన్' ఉష గారి పుస్తకం

ఆవకాయతో సహా.. 1000 రకాల పచ్చళ్లు :రికార్డులు సృష్టిస్తున్న 'పికెల్ క్వీన్' ఉష గారి పుస్తకం

(Story behind Usha's Pickle Digest)

ఆవకాయ పచ్చడి.. గోంగూర పచ్చడి.. మాగాయ పచ్చడి.. ఇలా ఒకటి, రెండు కాదు. దాదాపు 1000 రకాల పచ్చళ్లకు ఆమె రెసిపీలు రాశారు. కానీ ఆషామాషీగా వాటిని రాయలేదండోయ్. ఆ పచ్చళ్ల తయారీ విధానాన్ని తెలుసుకోవడం కోసం ఆమె ఏకంగా పరిశోధనలే చేశారు. ప్రాక్టికల్‌గా ఇంట్లో తయారుచేశాక.. ఏ పచ్ఛడి తయారీకి ఏ ఏ దినుసులు వాడాలి? మంచి సువాసన కలిగిన రుచి రావాలంటే ఏం చేయాలి.. మొదలైన టెక్నిక్స్‌‌తో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆమె గ్రంథస్థం చేశారు. ఆ పుస్తకం పేరే "ఉషాస్ పికెల్ డైజెస్ట్". ఈ పుస్తకాన్ని రాసింది తమిళనాడు మహిళ ఉషా ప్రభాకరన్.

గోదావరి జిల్లాలు అనగానే.. ఈ నోరూరించే వంటకాలు గుర్తొచ్చేస్తాయి..!

ఉద్యోగ రీత్యా న్యాయవాదైన ఉష..  పచ్ఛళ్ల తయారీ మీద ఆసక్తితో ఆ రంగం వైపు అడుగులు వేశారు. పచ్చళ్ల చరిత్రను, వివిధ ప్రాంతాలలో వాటి తయారీ పద్ధతులను క్షుణంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత పుస్తకాన్ని రాశారు. కానీ అప్పుడే విధి వక్రించింది. పుస్తకం విడుదలకు ముందే మెదడుకి సంబంధించిన ఓ వ్యాధి సోకడంతో మంచానికే పరిమితమయ్యారు ఉష. చాలా సంవత్సరాలు ఆమె కేవలం బెడ్‌ మీదే గడిపారు. ఇటీవలే ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. అయితే చిత్రమేంటంటే.. ఆమె పుస్తకం సూపర్ హిట్ అయ్యింది. ఆమె పుస్తకం విడుదలకు ముందు ఓ షాపుకి పంపిన 1000 కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

ఈ హోట‌ల్స్ పేర్లు విభిన్నం.. కానీ రుచి మాత్రం అద్భుతం..!

అయితే రీ ప్రింట్  కాపీలు రాకపోవడంతో.. ఆ పుస్తకం ఆన్‌లైన్‌లో కొన్నాళ్లు హల్చల్ చేసింది. అనేకమంది ఈ పుస్తకం మీద రివ్యూలు కూడా రాశారు. పికెల్ లవర్స్‌కి ఈ పుస్తకం బైబిల్ లాంటిదని పేర్కొన్నారు.అప్పుడే ఈ పుస్తకం రాసిన రచయిత గురించి.. మళ్లీ కాపీలు దిగకపోవడానికి గల కారణం గురించి జనాలకు తెలిసింది. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్స్ వారు స్వయంగా ఉష ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. తన పుస్తకం మీద జరుగుతున్న చర్చ గురించి తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. తర్వాత మరో 1000 కాపీలను ప్రింట్ చేయించారు. 

ఉగాది వేళ.. ఈ వంట‌కాలు నోరూరించ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి..!

గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పుస్తకం ఎంతగా ఆదరణను పొందుతుందంటే.. కాపీ దొరకని వ్యక్తులు స్నేహితుల వద్దకు వచ్చి పుస్తకాన్ని ఫోటోకాపీ తీయించుకొని మరీ వెళ్తున్నారట. పరిమిత కాపీలు మాత్రమే దించడానికి రచయిత్రి మొగ్గుచూపడంతో.. అమెజాన్ లాంటి సంస్థలు కాపీని ఆన్‌లైన్‌లో అద్దెకిచ్చే ఏర్పాటు కూడా చేశాయి. అయితే పేపర్ బ్యాక్ కాపీలు  మార్కెట్‌లోకి వస్తే వేగంగానే అమ్ముడైపోతున్నాయని అంటున్నారు బుక్ షాపుల యజమానులు.  ప్రస్తుతం ఉష మరో పుస్తకం మీద కూడా వర్క్ చేస్తున్నారు. దాని పేరు "ఉషాస్ రసం డైజెస్ట్"

ఇక "ఉషాస్ పికెల్ డైజెస్ట్" పుస్తకానికి వస్తే.. ఆమె అందులో 9 విభాగాలను పొందుపరిచారు. అవే క్లాసిక్, యూనిక్ ఫ్లేవర్స్, ఎక్స్ క్లూజివ్, ఎక్సాటిక్, క్విక్ సర్వ్, అసార్టడ్, ఆయిలీ ఫ్రీ, డైటరీ, యాంటీ వేస్ట్. అలాగే తయారీ విధానాన్ని ఛార్టుల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చాలా సరళమైన రీతిలో తెలియజేయడానికి ప్రయత్నించారు. అలాగే పచ్చళ్ల వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయో కూడా ఆమె.. ఈ పుస్తకంలో తెలిపారట. 63 సంవత్సరాల ఉష.. ప్రస్తుతం చెన్నైలోనే నివస్తున్నారు. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.