Zee Cine Awards (Telugu)
2019 సంవత్సరానికి సంబంధించి తెలుగు సినిమా అవార్డుల వేడుకను జీ గ్రూపు సంస్థ శనివారం అంగరంగవైభవంగా నిర్వహించింది. 2019లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, వాటిలో నటించిన నటులు, నటీమణులు.. ఆయా చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్స్ మొదలైనవారికి అవార్డులను ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం
ఉత్తమ నటుడు (చిరంజీవి) - 'సైరా' సినిమాలో నటనకు గాను మెగాస్టార్ చిరంజీవి ఉత్తమ నటుడు పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
ఉత్తమ నటి (సమంత) - ఓ బేబీ, మజిలీ చిత్రాలలో నటననకు గాను సమంత ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుంది.
ఉత్తమ అభిమాన నటుడు (నాని) - 'జెర్సీ' చిత్రంలో నటనకు గాను నాని ఉత్తమ అభిమాన నటుడు పురస్కారాన్ని అందుకోవడం విశేషం.
ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్) - ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని 'మహర్షి' చిత్రంలోని నటనకు గాను అల్లరి నరేష్ అందుకున్నారు.
ఉత్తమ హాస్య నటుడు (రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) - ఈ అవార్డును 'బ్రోచేవారెవరురా' సినిమాలో నటనకు గాను వీరిద్దరూ సంయుక్తంగా అందుకున్నారు.
ఉత్తమ విలన్ (తిరువే) - 'జార్జిరెడ్డి' సినిమాలో నటనకు గాను తిరువే ఉత్తమ విలన్ అవార్డును అందుకున్నారు.
ఉత్తమ సినిమాటోగ్రఫర్ (రత్నవేలు) - 'సైరా' చిత్రానికి ఛాయాగ్రహణం వహించినందుకు ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ఉత్తమ సంగీత దర్శకుడు (మణిశర్మ) - 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.
ఉత్తమ నిర్మాత (ఛార్మి) - 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి గాను ఆమె ఈ అవార్డు అందుకుంది.
ఉత్తమ గాయకుడు (సిద్ శ్రీరామ్) - 'డియర్ కామ్రేడ్' చిత్రంలోని 'కడలల్లే' పాటకు ఆయన ఈ పురస్కారం అందుకున్నారు
ఉత్తమ స్క్రీన్ ప్లే (వివేక్ ఆత్రేయ) - 'బ్రోచేవారెవరురా' సినిమాకి స్క్రీన్ ప్లే అందించినందుకు ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
ఉత్తమ నూతన నటి (శివాత్మిక రాజశేఖర్) - ' దొరసాని చిత్రంలో నటనకు గాను ఆమె ఈ అవార్డును అందుకుంది.
ఉత్తమ నూతన నటుడు (ఆనంద్ దేవరకొండ) - 'దొరసాని' చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
జీవిత సాఫల్య పురస్కారం - కె.విశ్వనాథ్
మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలోని.. 10 కీలక మైలురాళ్లు ..!
అలాగే ఈ అవార్డ్స్‌లో భాగంగా ఫేవరెట్ నటులు, నటీమణులకు కూడా పురస్కారాలు అందించారు. ఆ అవార్డుల జాబితా
ఉత్తమ ఫేవరెట్ నటుడు - నాని (జెర్సీ)
ఉత్తమ ఫేవరెట్ నటుడు (సపోర్టింగ్ ) - నీల్ నితిన్ ముఖేష్ (సాహో)
ఉత్తమ ఫేవరెట్ నటి - పూజా హెగ్డే (మహర్షి)
సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ - రామ్ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ ఫేవరెట్ ఆల్బమ్ - డియర్ కామ్రేడ్ (ప్రభాకరన్)
బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్ - శ్రద్ధ శ్రీనాథ్ (జెర్సీ)
ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!
2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి