2019లో తెలుగు సినిమాల్లో... తమ నటనతో 'టాప్ పెర్ఫార్మర్స్'గా నిలిచిన నటీమణులు వీరే

2019లో తెలుగు సినిమాల్లో... తమ నటనతో 'టాప్ పెర్ఫార్మర్స్'గా నిలిచిన నటీమణులు వీరే

Top Performances of the Telugu Actresses in the year 2020

2019 సంవత్సరంలో విడుదలైన  తెలుగు చిత్రాల్లో మనకి పలువురు నటీమణులు  పలికించిన అభినయం ఎప్పటికిీ గుర్తుండిపోతుంది. వారి అద్భుత నటన కారణంగా ఆయా చిత్రాలు విజయ బావుటా ఎగరవేశాయి.

ఇక మనం ఇప్పుడు ఆ  టాప్ పెర్ఫార్మెన్సెస్  ఇచ్చిన నటీమణులు ఎవరో.. అలాగే వారు నటించిన తెలుగు చిత్రాలు ఏంటో తెలుసుకుందాం

దీపిక ప‌దుకొణే 'ఛపాక్' చిత్రం ఎందుకు చూడాలంటే ..?

సమంత - మజిలీ & ఓ బేబీ

సమంత నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. అయితే ఆమె గత ఏడాది రెండు చిత్రాల్లో నటించడం.. అలాగే ఆ రెండు చిత్రాల్లో కూడా తన నటన ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె చూరగొనడం విశేషం. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా.. గొప్ప వసూళ్ళని సైతం రాబట్టడంలో ముఖ్య భూమికను పోషించాయన్నసంగతి తెలిసిందే.

ముందుగా 'మజిలీ' చిత్రం తీసుకుంటే... తనకి నచ్చినవాడిన పెళ్లి చేసుకుని కూడా.. కష్టాలు పడే ఒక గృహిణిగా మనం సమంతని చూడవచ్చు. ఒక ఎమోషనల్ పాత్రలో ఆమె చాలా చక్కగా ఒదిగిపోయింది. ఇక 'ఓ బేబీ' చిత్రానికి వస్తే, 60 ఏళ్ళ బామ్మ.. 20 ఏళ్ళ వయసు గల శరీరంలోకి మారితే ఎలా ఉంటుందో ఊహించి నటించాల్సిన పాత్రలో.. చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది సమంత. ఈ సంవత్సరంలో ఆమె నటించిన రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్నే అందుకున్నాయి.

ఝాన్సీ - మల్లేశం

ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది 'మల్లేశం' గారి జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రమే 'మల్లేశం'. మల్లేశం జీవితంలో ఆయన తల్లి లక్ష్మి పాత్ర ఎంతో ప్రముఖమైంది. ఆసు పని నుండి ఆమెకి విముక్తి కలిగించాలనే ఉద్దేశ్యంతోనే మల్లేశం ఆసు యంత్రాన్ని తయారుచేస్తాడు. అంతటి ప్రాధాన్యం ఉన్న లక్ష్మి పాత్రలో ప్రముఖ వ్యాఖ్యాత ఝాన్సీ నటించడం విశేషం

ఆమె లక్ష్మి పాత్రలో ఎంత సహజంగా ఒదిగిపోయారంటే.. మనకి సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ పాత్రలో ఝాన్సీ కనపడకుండా కేవలం లక్ష్మి మాత్రమే మనకి కనిపిస్తుంది. ఝాన్సీ చాలా బాగా చేసింది అని ఇంతకంటే ఇంకెలా చెప్పగలం. చాలామంది ఝాన్సీ నటనకు గాను.. కచ్చితంగా అవార్డులు ఆమె సొంతమవుతాయని విశ్లేషిస్తున్నారు.

బ్రోచేవారెవరురా - నివేతా థామస్

తల్లి ప్రేమ పొందే అవకాశం లేక, తండ్రి మద్దతు లభించక.. ట్యూషన్ టీచర్ ద్వారా లైంగిక వేధింపులకు గురై ఎక్కడికైనా పారిపోవాలి అని అనుకునే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రలో నివేత థామస్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించింది. పైగా ఈ సినిమా కోసం.. కేవలం 30 రోజుల వ్యవధిలో కూచిపూడిలో మెళుకువలు నేర్చుకుని సినిమాలో నాట్యాన్ని చేసి చూపడం ఆమె పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వివాదాస్పద వెబ్ సిరీస్ "లస్ట్ స్టోరీస్" తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

డియర్ కామ్రేడ్ - రష్మిక మందన్న

'గీత గోవిందం' చిత్రంలో చేసిన ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ తరువాత.. డియర్ కామ్రేడ్‌లో క్రికెట్ క్యాంప్‌లో వేధింపులకు గురికాబడి తద్వారా క్రికెట్‌నే వదిలిపెట్టి మానసికంగా కృంగిపోయే పాత్రలో నటించింది రష్మిక మందాన్న. సినిమా తొలి భాగంలో చలాకీగా కనిపించే లిల్లీ పాత్ర.. రెండో భాగంలో మాత్రం మానసికంగా కృంగిపోయిన అమ్మాయిలా చాలా వైవిధ్యాన్ని చూపెట్టగలిగింది.

ఈ పాత్ర తన వద్దకు వచ్చినప్పుడు.. ఎలాగైనా అందులో తానే నటించాలని భావించి.. అనేక అడ్డంకులు వచ్చినా సరే వాటిని అధిగమించి.. ఈ పాత్ర చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది రష్మిక

తమన్నా - సైరా నరసింహా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇక ఈ చిత్రం టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది.. ఇందులో ఎక్కువ శాతం కథ చిరంజీవి చుట్టూ తిరుగుతుందని.  అయితే ఇందులో చిరంజీవి ఎంత అగ్రభాగాన్ని తీసుకున్నా..  తాను కూడా పోటీలో ఉన్నానంటూ తమన్నా సైతం ఆయనకు పోటీ ఇచ్చేలా నటించడం విశేషం. లక్ష్మి అనే ఒక నృత్యకారిణి పాత్రలో ఆమె పండించిన అభినయం ఆమెకి ఎన్నో ప్రశంసలని తెచ్చిపెట్టింది.

రెజినా - ఎవరు

రెజీనా అనగానే ఒక పక్కా కమర్షియల్ నటి అనంటారు నెటిజన్లు. అయితే అలాంటి కామెంట్లకి గత ఏడాది 'అ' చిత్రం ద్వారా కాస్త గట్టిగానే సమాధానం చెప్పిందామె. ఇక ఈ ఏడాది కూడా 'ఎవరు' అనే చిత్రంలో ప్రతినాయిక పాత్ర పోషించి ఆమెలోని నటనను మరోసారి ప్రేక్షకులకి పరిచయం చేసింది. 'ఎవరు' సినిమా ప్రచార చిత్రాలలోనే.. ఒకవైపు తనలోని గ్లామర్ షేడ్‌ని చూపిస్తూ.. మరోవైపు విలనీ షేడ్‌ని కూడా చూపించేసింది. మొత్తానికి తనలోని అభినేత్రిని తక్కువగా అంచనా వేయకండి అని విమర్శకులకు తన అభినయం ద్వారానే సమాధానం చెప్పింది.

ఇవండీ.. ఈ 2019వ సంవత్సరంలో అద్భుతంగా తమ అభినయాన్ని ప్రదర్శించిన నటీమణుల వివరాలు.

తొలి చిత్రమే "స్వలింగ సంపర్కం"పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం