వాటి వంక చొంగ కార్చుకుంటూ చూసేవారిని.. చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరి..

వాటి వంక చొంగ కార్చుకుంటూ చూసేవారిని.. చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరి..

వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిలను కామవాంఛతో చూసే పురుష పుంగవులకు కొదవ లేదు. ఆటోలో వెళుతున్నా.. బస్సులో వెళుతున్నా.. షాపింగ్‌కి వెళ్లినా.. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే కొందరు అమ్మాయిల స్తనాలు (breasts) వైపు అలాగే చూస్తుంటారు. ఆ సమయంలో ‘గుడ్లప్పగించి ఏం చూస్తావురా?’ అని నిలదీసి వారికి ఆ చెంపా ఈ చెంపా వాయించాలనిపిస్తుంది కదా. అసలు వక్షోజాల వంక కన్నార్పకుండా చూసే ప్రబుద్ధుల గురించి మనసులో తిట్టుకోకుండా ఉండలేం. ఇలాంటి వారిని చూస్తే కొన్నిసార్లు ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టాలనిపించదు. మన వక్షోజాలు (boobs) వారిని ఎందుకు ఆకర్షిస్తాయో తెలియదు. వారెందుకు అలా చూస్తున్నారో మనకు తెలియదు.

ఎంత చున్నీతో, స్కార్ఫ్‌తో కవర్ చేసుకున్నా అలానే చూస్తుంటారు. మరో వైపుకి తిరిగి నిల్చుదామంటే.. అప్పటికే గుడ్లు మిటకరించి చూసేవాడు మరొకడుంటాడు. అసలు ఆ సమయంలో మనకొచ్చే చిరాకును చాలా కంట్రోల్ చేసుకుంటాం. లేదంటే అవతలివాడి ముక్కు పగిలిపోయి ఉండేది. మనం అలా ఉంటున్నాం కాబట్టే.. వాళ్లు అలా రెచ్చిపోతున్నారని కూడా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. పైకి అనకపోయినా.. మన మనసులో చాలానే అనుకుంటాం. లేదా మన వెంట ఉన్న స్నేహితురాలితో ఈ విషయాలను పంచుకుంటాం. అసలు ఆ సమయంలో మన మనసులో ఏమని అనుకుంటామో ఓ సారి అవలోకనం చేసుకుందాం. 

1. అవేమన్నా నీతో మాట్లాడుతున్నాయట్రా

బాబూ ప్లీజ్ అలా చూడకమ్మా. ఇంకాసేపు నా వక్షోజాల (breasts) వైపు అలాగే చూశావంటే గుడ్లు పీకేస్తా

Giphy

2. నీకేమైనా ఎక్స్ రే విజన్ ఏమైనా ఉందా? స్కాన్ చేసేస్తున్నావ్?

నీ సూపర్ పవర్స్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయ్.. వాటిని పనికొచ్చే వాటికి ఏదైనా ఉపయోగించవచ్చు కదా?

3. నేను నీ ముఖం చూసి మాట్లాడుతుంటే.. నువ్వేంటి అక్కడ చూస్తూ మాట్లాడుతున్నావ్?

నాకు వక్షోజాలు ఉండటం వల్లే వీడు నాతో మాట్లాడుతున్నట్టున్నాడు. వెనక్కి తిరిగైనా కూర్చుంటా. లేదంటే నమిలేసేలా ఉన్నాడు.

Giphy

4. ఒరేయ్ మరీ ఎక్కువ చొంగ కార్చేయొద్దు. షర్ట్ తడిచిపోతుంది.

మరీ అలా చూస్తుంటే ఒళ్లంతా తేళ్లూ, జెర్రులూ పాకుతున్నట్టుగా ఉంటుంది. ఇంక ఆపయ్యా.

5. నా డ్రస్ మీద ఏదైనా పడిందా? మరక ఏమైనా అయిందా? ఏమీ లేదే?

లాగిపెట్టి ఒక్కటిస్తే అప్పుడు నీ ముఖం మీద అవుతుంది నెత్తుటి మరక. అప్పుడు చూసుకుందువు గానీ నీ ముఖాన్ని కన్నార్పకుండా.

Giphy

6. నా స్తనాలు ఎలా ఉన్నాయని పరీక్షిస్తున్నావా? నేను ఊపిరి తీసుకుంటున్నానా లేదా అని చెక్ చేస్తున్నావా?

నీ కళ్లలోకి నేను చూడలేకపోతున్నాను. నన్ను క్షమించు. మీ కళ్లకు నా స్తనాలు కలిగిస్తున్న ఇబ్బందికి నన్ను క్షమించండి. #SassMeetsSarcasm

7. నన్ను ఇబ్బంది పెట్టడమే ఈ రోజు నీ అజెండా అనుకుంటా

ప్లీజ్ బడ్డీ.. జస్ట్ స్టాప్ ఇట్. ఎంతసేపని అలా చూస్తావు? నీకు విసుగనిపించడం లేదా?

Giphy

8. అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడానికి ఇదో కొత్త పద్దతా? ఇప్పటి వరకు ఈ విషయం నాకెవరూ ఎందుకు చెప్పలేదు.

లేకపోతే సిగ్గులేకుండా ఎందుకు ఇలా చూస్తాడు?

9. నీక్కూడా స్తనాలు కావాలా ఏంటి? అలా చూస్తున్నావు?

చాలా ఈజీ బ్రో. జస్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే చాలు.

Giphy

10. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. నువ్వు నా వంక ఎలా చూస్తున్నావో నేను కూడా నీ వంక అలాగే చూస్తా..

కొన్నిసార్లు మాటల కంటే చేతలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

11. బాబూ ఇక చాలు. మరీ ఎక్కువ సేపు చూడకు కళ్లు నొప్పెడతాయి.

నువ్వు చూడటం వల్ల నా బ్రెస్ట్ సైజ్ ఏమీ పెరగదు. చూసింది సరిపోతుంది.. కాస్త రెస్ట్ తీసుకో.. లేదంటే కొన్ని రోజులకు కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తుంది.

Giphy

12. నా వక్షోజాల ఎందుకు వంక అంత దీర్ఘంగా చూస్తున్నావ్?

కొంపతీసి నువ్వేమైనా నా బ్రెస్ట్స్‌తో మాట్లాడుతున్నావా? వెరీ ఇంటరెస్టింగ్.. ఇంతకీ ఏం మాట్లాడావేంటి?

మనల్ని ఎవరైనా ఏ విషయంలోనైనా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వారికి చెప్పాలి. కానీ మనం పెరిగిన సమాజ నేపథ్యం వల్ల.. ఆ విషయాన్ని మనం మన మనసులోనే దాచేసుకొని అనవసరమైన టెన్షన్లను పెంచుకుంటాం. ముఖ్యంగా ఎవరైనా మనల్ని లైంగికంగా వేధిస్తున్నప్పుడు లేదా మన వైపు అదోలా చూస్తున్నప్పుడు భయంతో ముడుచుకుపోతాం. ఒక్కసారి వారికి  చెప్పే విధంగా చెబితే మళ్లీ ఇంకొకరి జోలికి వెళ్లరు. ఇంకెప్పుడైనా ఎవరైనా మీ స్తనాలు(breasts) వైపు ఇలా చూస్తుంటే ఇదుగో పైన.. మనం చెప్పుకున్న వాటిని పాటించి వారి పని పట్టండి. కానీ వాటిని వాడాల్సిన అవసరం రాకుండా ఉండే రోజు వస్తే బాగుంటుంది కదా.

ఇవి కూడా చదవండి: ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్

కొత్తగా పెళ్లైన దంపతులకు.. చికాకు తెప్పించే ప్రశ్నలివే..!

ప్రతి అమ్మాయి.. తనకు కాబోయే భర్తను ఈ ప్రశ్నలు అడగాలని భావిస్తుందట..!

 

 

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది